Biscuit Cake Without Oven: కేక్ కొనాల్సిన అవసరం లేదు.. ఇంట్లోనే 10 నిమిషాల్లో బిస్కెట్ కేక్ రెడీ!

Published : Aug 08, 2026, 10:09 AM IST

Biscuit Cake Without Oven: కేక్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్దలదాకా అందరికీ ఇష్టమే. ఇంట్లో చేయాలంటే ఓవెన్ ఉండాలి, మైదా, గుడ్లు, బటర్, ఎసెన్స్ ఇలా కావాలి అనుకుంటారు. ఇవేమీ లేకుండానే బిస్కెట్లతోనే టేస్టీగా, సాఫ్ట్‌గా కేక్ చేసుకోవచ్చు. ఓవెన్ లేకుండానే.

PREV
15
ఈజీ బిస్కెట్ కేక్..10 నిమిషాల్లో మ్యాజిక్

స్కూల్ నుంచి వచ్చాక పిల్లలకు స్నాక్స్ తినాలని అనిపించడం, ఆఫీసు నుంచి వాళ్లకి ఇంట్లో ఏం ఉన్నాయి తినడానికి అని అడగడం కామన్. అలా అని బయట దొరికే ఫుడ్ తింటే అన్ హెల్దీ. ఒకవేళ ఇంట్లో తినడానికి ఏమీ లేకపోయినా కూడా...వాళ్లు ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు 10 మినిట్స్ లో ఈ కేక్ చేసేయొచ్చు. సెపరేట్‍గా బయటకెళ్లి కొనే పని లేకుండా ఇంట్లో ఉండే కేవలం కొన్ని పదార్థాలతో ఈజీగా తయారయ్యే ఈ బిస్కెట్ కేక్‌ను సాయంత్రం స్నాక్‌గా లేదా పిల్లలకు స్పెషల్ ట్రీట్‌గా చేసుకోవచ్చు.

25
కావాల్సిన పదార్థాలు

బిస్కెట్ కేక్ తయారు చేయడానికి ముందుగా 2 ప్యాకెట్ల చాక్లెట్ బిస్కెట్లు లేదా మారీ బిస్కెట్లు తీసుకోవాలి. వీటితో పాటు ఒక కప్పు పాలు, అర టీస్పూన్ బేకింగ్ పౌడర్, ఒక టీస్పూన్ కోకో పౌడర్, అవసరాన్ని బట్టి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల పంచదార తీసుకోవాలి. కేక్ మౌల్డ్‌కు రాయడానికి కొద్దిగా బటర్ లేదా నెయ్యి కూడా సిద్ధంగా ఉంచుకోవాలి.

35
బిస్కెట్ కేక్ తయారీ విధానం

ముందుగా బిస్కెట్లను చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్‌లో వేసుకోవాలి. వాటిని మెత్తగా పొడిలా చేసుకోవాలి. బిస్కెట్లలో ఇప్పటికే తీపి ఉంటుంది కాబట్టి పంచదార మరీ ఎక్కువ అవసరం లేదు. ఇంకా కాస్త తీపి కావాలనుకుంటే కొద్దిగా పంచదార వేసుకోవచ్చు.

ఇప్పుడు బిస్కెట్ పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో బేకింగ్ పౌడర్, కోకో పౌడర్ వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దికొద్దిగా పాలు పోస్తూ కలుపుకోవాలి. మిశ్రమం మరీ గట్టిగా లేదా పలుచగా కాకుండా కేక్ బ్యాటర్‌లా ఉండాలి. బ్యాటర్ సిద్ధమైన తర్వాత ఒక స్టీల్ గిన్నె లేదా కేక్ మౌల్డ్‌కు కొద్దిగా బటర్ లేదా నెయ్యి రాసి అందులో బ్యాటర్ పోయాలి.

45
ఓవెన్ లేకుండా కేక్ ఎలా చేయాలి?

ఇప్పుడు స్టవ్‌పై మందపాటి అడుగు ఉన్న కడాయి పెట్టి అందులో కొద్దిగా ఉప్పు వేసి 2–3 నిమిషాలు వేడి చేయాలి. తర్వాత ఒక స్టాండ్ పెట్టి దానిపై కేక్ మౌల్డ్ ఉంచాలి. మూత పెట్టి మీడియం-లో ఫ్లేమ్‌పై సుమారు 10–15 నిమిషాలు ఉడికించాలి.

కేక్ ఉడికిందో లేదో తెలుసుకోవడానికి టూత్‌పిక్‌ను మధ్యలో గుచ్చాలి. దానికి బ్యాటర్ అంటుకోకుండా బయటకు వస్తే కేక్ రెడీ అయినట్టే. కాసేపు చల్లారిన తర్వాత మౌల్డ్ నుంచి కేక్‌ను బయటకు తీసుకోవాలి.

55
చాక్లెట్ సిరప్, డ్రై ఫ్రూట్స్ తో రెడీ

పైన చాక్లెట్ సిరప్, చాక్లెట్ చిప్స్ లేదా డ్రై ఫ్రూట్స్‌తో రెడీ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఓవెన్ లేకపోయినా ఇంట్లోనే ఈజీగా తయారయ్యే ఈ బిస్కెట్ కేక్‌ను ఒక్కసారి ప్రయత్నిస్తే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories