Kids Height: మీ పిల్లల వయసు పెరుగుతున్నా.. హైట్ పెరగడం లేదా.? అయితే ఇలా చేయండి..

Published : Jan 25, 2022, 01:58 PM IST

Kids Height: కొంత మంది పిల్లలకు వయసు పెరుగుతున్నా.. హైట్ మాత్రం పెరగరు. అలాగే పొట్టిగా ఇంకా చిన్నపిల్లాడిలానే కనిపిస్తూ ఉంటారు. దీంతో ఆ పిల్లలు తోటి పిల్లలతో పోల్చుకుంటూ తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. దాంతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగిపోతుంది. అయితే పిల్లలు వయసుతో పాటు పెరగాలంటే..   

PREV
16
Kids Height:  మీ పిల్లల వయసు పెరుగుతున్నా.. హైట్ పెరగడం లేదా.? అయితే ఇలా చేయండి..

Kids Height: పిల్లలు వయసుకు తగ్గట్టుగా పొడుగ్గా ఉంటేనే బాగుంటుంది. కానీ కొంతమంది పిల్లలకు వయసు పెరుగుతున్నా.. ఎత్తు మాత్రం అస్సలు పెరగరు. అలాగే పొట్టిగా ఉంటారు. అలాంటి పిల్లలు తమ హైట్ ను తన తోటి పిల్లలతో పోల్చుకుంటూ తీవ్రమైన మానసిక ఒత్తిడి గురవుతారు. ముఖ్యంగా వారిలో ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. ఈ కారణంగా ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళలనకు గురవుతుంటారు. 
 

26

పిల్లలు హైట్ పెరగడానికి ప్రధాన కారణాలు ఒకటి జన్యుపరమైన (Genetic) లోపం కాగా, మరోటి వాళ్ల ఆహారపు అలవాట్లు. అందుకే పిల్లల ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ఇలాంటి సమస్యలే ఎదురవుతాయి. ముఖ్యంగా పిల్లలు మారం చేస్తున్నారని  ఐస్ క్రీమ్లు, చాక్లెట్స్, బిస్కెట్స్ వంటివి ఇవ్వకూడదు. వీటికి బదులుగా మంచి పోషకవిలువలుండే ఆహారాన్నే అలవాటు చేయాలి. అప్పుడే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా పిల్లలకు ఏ ఫుడ్ పెడితే వారు వారి ఏజ్ కు తగ్గట్టు హైట్ పెరుగుతారో అలాంటి ఆహారాన్నే పెట్టాలి. అలా అయితేనే పిల్లల ఎదుగుదల ఉంటుంది. ఇందుకు పిల్లలకు ఎలాంటి ఆహారం పెట్టాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

36

చికగడ దుంప:  ఈ చిలగడ దుంపలో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. అందుకే ఎదుగుతున్న పిల్లలకు ఇది తప్పకుండా తమ ఆహారంలో చేర్చాలి.  అంతేకాదు ఇది పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచడంలో కూడా ముందుంటుంది. అంతేకాదు ఎముకల ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో సహాయపడతాయి. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు ఇది చక్కడి ఔషదంలాగ పనిచేస్తుంది. అలాగే ఇందులో ఉండే ఫైబర్లు జీర్ణక్రియ పనితీరును మెరుగ్గా చేస్తుంది. 

46


ఖనిజాలు, విటమిన్లు, ఇతర Phytonutrients ఎక్కువ మొత్తంలో లభించే స్ట్రాబెర్రీ లు, బ్లూ బెర్రీలు, మల్బరీ వంటి పండ్లు పిల్లల ఎదుగుదలకు ఎంతగానో సహకరిస్తాయి. బెర్రీల్లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. వాటిని తినడం ద్వారా శరీరంలో కొల్లాజెన్ ను ఉత్పత్తి అయ్యి అది  పిల్లలు హైట్ పెరగడానికి సహాయపడుతుంది. అంతేకాదు శరీర Cell structure కు కూడా బాగా ఉపయోగపడతాయి. అందుకే ప్రతి రోజూ ఈ బెర్రీలను మీ పిల్లలు తినేలా చూడాలి. 
 

 

56


పోషకవిలువలు అధికంగా ఉండే పాలు, గుడ్డు కూడా పిల్లల ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిల్లో మినరల్స్, క్యాల్షియం, ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. సో ఎదిగే పిల్లలకు ఇవి వారి హైట్ పెరగడానికి దోహదం చేస్తాయి. అందుకే మీ పిల్లలు పొట్టిగా ఉంటే వారికి ప్రతిరోజూ ఉడకబెట్టిన గుడ్డు, పాలు ఇవ్వండి. 
 

66

ఆకు కూరలు కూడా పిల్లలు హైట్ పెరిగేందుకు ఎంతగానో సహకరిస్తాయి. ఈ ఆకు కూరల్లో మినరల్స్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. వీటని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. అలాగే దృఢంగా కూడా అవుతాయి. అందుకే పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఆకు కూరలను మీ పిల్లల ఆహారంలో ఉండేట్టు చేసుకోవాలి. అంతేకాదు ఇవి వారి ఎత్తును పెంచడంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి.    
 

Read more Photos on
click me!

Recommended Stories