love break up: మీకు తెలుసా.. లవ్ బ్రేకప్ అయితే వీళ్లే ఎక్కువ బాధ పడతారట!

First Published Jan 25, 2022, 12:52 PM IST

love break up: ప్రేమ అదో సరికొత్త ప్రపంచం. ఇందులో మునిగి తేలుతుంటే కళ్లముందున్న ప్రపంచం కానరాదు. ప్రేమలో ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటారో వారు మాటల్లో చెప్పలేరు. ఒకవేళ ఆ ప్రేమ కొన్ని అనుకోని కారణాల వల్ల బ్రేకప్ అయితే వచ్చే బాధ కూడా మాటల్లో చెప్పలేనిదే. అయితే లవ్ బ్రేకప్ అయినప్పుడు ఎవరిలో ఎక్కువ బాధ ఉంటదంటే మీరేం చెప్తారు.
 

love break up: ప్రేమలో పడటం, అందులో మునిగి తేలడం ఎవరూ నిర్వచించలేని మధురమైన అనుభూతి. అంతేకాదు ప్రేమలో ఎన్నో అలకలు అంతకు మించి ఎవరిపై లేనటువంటి నమ్మకం, ఒకరకమైన స్వార్థం, త్యాగం అన్నికలగలిపిన మధురమైన క్షణాలుంటాయి. ప్రేమలో ప్రతి క్షణం మధురమైతే. ప్రతీది గుర్తించుకోవాల్సిన విశేషమే. అదే ప్రేమ దూరమైతే ఎలా ఉంటుంది? మాటల్లో చెప్పలేని నరకం, భరించలేని బాధ ఉంటాయని బ్రేకప్ అయిన వాళ్లు చెప్తుంటారు.
 


 ప్రేమలో ఉన్నప్పుడు నా ప్రాణం తనే , తాను లేక నేను లేను అని చెప్పుకునే వారు ప్రేమ దూరమైతే.. నా లైఫ్ అంటే తానే అంటూ బాధతో మూలుగుతుంటారు. అయితే ఇద్దరి మధ్య కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయినప్పుడు అబ్బాయి ఎక్కువ బాధపడతాడా? లేకపోతే అమ్మాయి ఎక్కువ బాధపడుతుందా? అంటే ఏం చెబుతారు. ఎవరికి వారు మేమే ఎక్కువ బాధ పడతామని అటు అబ్బాయి, ఇటు అమ్మాయి చెప్పుకుంటారు. కొందరు ఆలోచించి వీళ్లే ఎక్కువ బాధపడతారని చెప్తుంటారు.
 

 నిజానికి బ్రేకప్ భాద ఎవరకి ఎక్కువగా ఉంటుందో తెలుసా.. అబ్బాయిలకే.. అవును మీరు చదివింది నిజమే రిలేషన్ షిప్ బ్రేకప్ అయినప్పుడు అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా బాధపడతారట. బ్రిటన్ కు చిందిన ఓ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి వెల్లడించారు. ఈ పరిశోధనను తేలిగ్గా తీసిపారేయకండి. ఎందుకంటే ఈ పరిశోధన కోసం ఏకంగా ఒక లక్షా 44,000 మందిని తీసుకున్నారట.  వీరంతా లవ్ ఫెయిల్యూర్ అయినవారేనట. వాళ్లను అన్ని విధాలుగా పరిశీలించిన తర్వాతే ఈ విషయాన్ని వెళ్లడించారట. 

కాగా మగవారే ఎక్కువ బాధపడటానికి చాలా కారణాలే ఉన్నాయని ఆ అధ్యయనం తెలుపుతోంది. బ్రేకప్ కావడంతో అమ్మాయిలు కూడా బాధపడినా.. అబ్బాయిల కంటే అది తక్కువ బాధేనని తేల్చి చెబుతున్నారు.  
 

ఆడవారు తమ బ్రేకప్ విషయాన్ని తెలిసిన వాళ్లతో చెప్పుకుంటారు గానీ.. అబ్బాయిలు ఆ విషయాన్ని ఎవరితో  కూడా చెప్పుకోరని సర్వే వెళ్లడిస్తోంది. దీనిమూలంగానే వారిలో బాధ ఎక్కువయ్యి కుళ్లి కుళ్లి ఏడుస్తారట. అందులోనూ మరెవరితోనూ కలవక జీవితంలో వాళ్ల ప్రేమనే తలచుకుంటూ బతుకుతారని సర్వే తెలుపుతోంది. 

అయితే వీరు తమ రిలేషన్ షిప్ ఎందుకు బ్రేకప్ అయ్యిందో అనే విషయాన్ని కూడా వెల్లడించారు.లవ్ లో ఉన్నప్పుడు ఇద్దరి మధ్య నమ్మకం లేకపోవడం వల్లే ఎక్కువగా విడిపోతున్నట్టు సర్వే చెబుతోంది. కాగా కొంత మంది యువకులు తమ ప్రియురాళ్లు వారిని కాదని వేరొకరిని ఇష్టపడుతుందేమోనన్న భయం వల్లే విడిపోయినట్లు వెళ్లడైంది. 

depression man


ఈ బ్రేకప్ వల్ల కొంత మంది పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారట. మరికొంతమంది ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తేలింది. ఇక ఏదేమైనా లవ్ ఫెయిల్యూర్ అయితే ఆ బాధ అమ్మాయిల కంటే అబ్బాయిలకే ఎక్కువ ఉంటుందని అధ్యయనం పేర్కొంటోంది. 
 

click me!