సెక్స్ కేలరీలను కరిగిస్తుంది.. దీనిలో ఎక్కువ కేలరీలు బర్న్ కావాలంటే?

First Published | Feb 4, 2023, 9:44 AM IST

శృంగారంతో ఎన్నో మానసిక, శారీరక సమస్యలు తగ్గిపోతాయన్న ముచ్చట చాలా మందికి తెలుసు. అయితే బరువు తగ్గాలనుకునే వారికి కూడా సెక్స్ ప్రయోజనకరంగా ఉంటుంది తెలుసా? అవును శృంగారంతో ఆడవారు, మగవారిలో కేలరీలు బాగా బర్న్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. 

శృంగారం ఒక కఠినమైన శారీరక శ్రమ. ఇది కూడా వ్యాయామం లాంటిదేనంటారు నిపుణులు. మీకు తెలుసా? సెక్స్ సమయంలో కేలరీలు చాలా బర్న్ అవుతాయని ఎన్నో అధ్యయనాలు కనుగొన్నాయి. మొత్తం సెక్స్ సమయంలో బర్న్ అయ్యే కేలరీలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి."యువ ఆరోగ్యకరమైన జంటలలో లైంగిక కార్యకలాపాల సమయంలో శక్తి వ్యయం" అనే శీర్షికతో జరిపిన ఒక పరిశోధన అధ్యయనం "లైంగిక చర్య సమయంలో శక్తి వ్యయం సుమారు 85 కిలో కేలరీలు లేదా 3.6 కిలో కేలరీలు నిమిషానికి బర్న్ అవుతాయట. 
 

మహిళల కంటే పురుషులకే ఎక్కువ ప్రయోజనం

చాలా మంది పురుషులు మహిళల కంటే శారీరకంగా బరువుగా, బలంగా ఉంటారు. కాబట్టి ఈ చర్య చేయడానికి పురుషులలో శక్తి వ్యయం మహిళల కంటే ఎక్కువగా ఉంటుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. మహిళల కంటే పురుషులే బరువు ఎక్కువగా ఉంటారు. దీనివల్ల వ్యాయామం కోసం పురుషులలో శక్తి వ్యయం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 
 


టైం ముఖ్యం

సెక్స్ లో పాల్గొంటూ కేలరీలను ఎక్కువ బర్న్ చేయాలనుకుంటే దీనిలో ఎక్కువ సేపు ఉండాలని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ వ్యవధి ఎంత ఎక్కువ ఉంటే మీరు అంత ఎక్కువ కేలరీలను బర్న్ చేయగలుగుతారు. 
 

సరైన సెక్స్ పొజీషిన్ కూడా ముఖ్యమే.. 

ఎక్కువ కేలరీలను బర్న్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. ఒకే పొజీషన్ కాకుండా వేరే వేరే సెక్స్ పొజీషన్స్ ను ప్రయత్నించాల్సి ఉంటుంది. ఆడవారికి స్క్వాట్ పొజీషన్ 115 కేలరీల కంటే ఎక్కువ బర్న్ చేస్తుందట. పురుషులకు అయితే   wheelbarrow position 150 కేలరీలను బర్న్ చేస్తుందని నివేదికలు చెబుతున్నాయి. 

మిషనరీ, డేగ, స్పూనింగ్ భంగిమలు తక్కువ కేలరీలను బర్న్ చేస్తాయని చెబుతారు.
 

నియమం లేదు

నిజం చెప్పాలంటే సెక్స్ సమయం  కేలరీలు బర్న్ అయ్యే పరిమాణం వ్యక్తి వ్యక్తికి మారుతుందట. అంటే ఇది లైంగిక చర్య తీవ్రత, సెక్స్ లో పాల్గొనే సమయం, ఫోర్ ప్లే వ్యవధి, సెక్స్ స్థానం వంటి అంశాలను ఇది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. 
 

చివరి మాట

కేలరీలు బర్న్ చేయాలనే ఉద్దేశ్యంతోనే సెక్స్ లో పాల్గొనకండి. ఎందుకంటే సెక్స్ అనేని ఆహ్లాదకరమైన చర్య. దీనిలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఫీల్ గుడ్ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. శృంగారంలో పాల్గొనడం వల్ల మీ మానసిక, శారీరక ఆరోగ్యం బాగుంటుంది. 
 

Latest Videos

click me!