
ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సరిపడా నీటిని తాగాల్సిందే. లేదంటే శరీరం ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. మన శరీరం ఫుడ్ లేకుండా కొన్ని వారాలైనా ఉంటుంది కానీ.. నీరు లేకుండా రోజులు కూడా ఉండలేదు. నీరు రక్తం, మూత్రం, జీర్ణ రసాలు, చెమటకు ఆధారం. నీరు లేకుంటే ఈ ప్రక్రియలు జరగవు. అందుకే మన శరీరానికి సరిపడా రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తుంటారు.
అయితే కొంతమంది పనిలో పడి నీళ్లు తాగడమే మర్చిపోతుంటారు. ఇలాంటి వాళ్లు కేవలం తినేటప్పుడు మాత్రమే నీళ్లను తాగుతారు. నిజానికి నీళ్లన భోజనం చేసేటప్పుడు మధ్యమధ్యలో తాగడం అస్సలు మంచిది కాదు. దీనివల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదన్న సంగతి మీకు కూడా తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇలా తాగితే శరీరంలో విషతుల్యాలు పేరుకుపోతాయి. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని కొందరు చెబుతున్నారు. ఆయుర్వేదం కూడా ఇలా తాగడం మంచిది కాదని చెబుతోంది.
సైన్స్ ఏమంటోందంటే..
తినేటప్పుడు నీళ్లను తాగడం వల్ల మీ జీర్ణక్రియను బలహీనపరిచేలా మీ కడుపు ఆమ్లాలను పలుచగా చేస్తుందని ఎలాంటి అధ్యయనాలు చెప్పలేదు. అయితే కడుపు ఆమ్లానికి నీటిని జోడించడం వల్ల ప్రోటీన్ జీర్ణం కావడం కష్టంగా మారుతుంది. అలాగే ఖనిజాలు, విటమిన్లు శోషించుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది. మొత్తంగా నీరు జీర్ణక్రియ ప్రభావాన్ని తగ్గిస్తుంది.
మీరు తినే భోజనం కూడా నీటి అవసరాన్ని ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహాన్ని తింటే నీటిని ఎక్కువగా తాగే అవకావం ఉంది. సలాడ్ తీసుకున్న తర్వాత మీకు దాహం ఎక్కువ కావడాన్ని మీరు గమనించే ఉంటారు. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే భోజనం చేసేటప్పుడు జీర్ణక్రియ సాఫీగా జరగాలంటే నీటిని ఎక్కువగా తాగకపోవడమే మంచిది.
దీనితో పాటుగా భోజనానికి ముందు, తర్వాత, భోజన సమంలో మీరు తాగే నీటి రకం కూడా ముఖ్యమే అంటున్నారు నిపుణులు.. ఆల్కలీన్ నీటిని తాగడం వల్ల మీ కడుపు ఆమ్లాలు మరింత తటస్తం అవుతాయి. అయితే ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపిన నీటిని సిప్ చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చివరిగా.. భోజనం చేసేటప్పుడు నీళ్లు తాగడం మంచిది కాదని.. దాహం అయినా తాగకుండా ఉండకండి. ఇది ప్రమాదకరం. ఎందుకంటే భోజన రకం బట్టి నీటి అవసరమవుతుంది. అందుకే దాహం అయితే నీళ్లను తాగేయండి.
నీటిని ఎప్పుడెప్పుడు తాగాలంటే..
నిద్రలేచిన తర్వాత: నిద్రలేచిన వెంటనే రెండు గ్లాసుల నీటినా తాగడం మంచిది. ఇది మీ అంతర్గత అవయవాలు సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. రోజులో మీ బ్రేక్ ఫాస్ట్ కు ముందు నీటిని తాగడం వల్ల శరీరంలో ఉండే విషాలు తొలగిపోతాయి.
భోజనానికి ముందు
భోజనం చేయడానికి 30 నిమిషాల ముందు గ్లాస్ నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. అయితే భోజనానికి ముందు ఆ తర్వాత అప్పుడే నీళ్లను తాగకూడదని గుర్తుంచుకోండి. ఎందుకంటే నీళ్లు జీర్ణ రసాలను పలుచగా చేస్తుంది. శరీరం పోషకాలను శోషించుకోవాలంటే భోజనం చేసిన గంట తర్వత నీళ్లను తాగండి.
స్నానానికి ముందు: స్నానం చేయడానికి ముందు ఒక గ్లాస్ నీటిని తాగడం వల్ల మీ రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.