జీడిప్పప్పులు శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. అలాగే రక్తపోటును మెరుగుపర్చడానికి సహాయపడతాయి. వేరుశెనగ, జీడిపప్పుల్లో ఫైబర్ కంటెంట్ తో పాటుగా, పాలీ అన్శాచురేటెడ్ కొవ్వులు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. ప్రతిరోజూ గుప్పెడు జీడిపప్పులు తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశమే ఉండదు. అలాగే డయాబెటీస్, క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది.