ఎసిడిటీని తగ్గించే అద్బుతమైన చిట్కాలు మీకోసం..

First Published Sep 15, 2022, 4:57 PM IST

ఎసిడిటీ వల్ల పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి పుడుతుంది. అసౌకర్యంగా కూడా ఉంటుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. అదెలాగంటే.. 
 

acidity

ఖాళీ కడుపుతో ఉండటం, కాఫీ, టీ, మద్యపానం, ధూమపానం వంటి అలవాట్ల వల్ల ఎసిడిటీ వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆమ్లాల స్రావం సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు గుండెల్లో మంట అనుభూతి కలుగుతుంది. లేదా యాసిడ్ రిఫ్లక్స్ సంభవిస్తుంది. దీని నుంచి బయటపడటానికి ఎన్నో రకాల చిట్కాలను పాటిస్తుంటారు. 

ఎసిడిటీ అంటే ఏమిటి?

మన శరీరంలో ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. దీంతో జీర్ణక్రియ ప్రక్రియ పూర్తి అవుతుంది. ఈ ఆమ్లం కడుపు గ్రంధులలో సహజంగా ఉత్పత్తి అవుతుంది. అయితే డీహైడ్రేషన్, అతిగా ఆల్కహాల్ ను తాగడం, ఒత్తిడి, స్మోకింగ్ చేయడం కారణాల వల్ల ఈ ఆమ్లం ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుంది. దీంతో ఎసిడిటీ వస్తుంది.
 

Acidity

నోటిలో పుల్లని త్రేన్పులు, కడుపు, నోటిలో మంట, కడుపు బరువుగా అనిపించడం, మలబద్దకం, ఛాతిలో నొప్పి, చెడు శ్వాస, గొంతులో ముద్ద ఉన్నట్లుగా అనిపించడం, వికారం,  వాంతులు, అజీర్థి, పదేపదే ఎక్కిళ్లు రావడం, శరీర బలహీనత వంటివి ఎసిడిటీ లక్షణాలు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో ఈ ఎసిడిటీ సమస్య నుంచి బయటపడొచ్చు. అవేంటంటే.. 

తులసి ఆకులు: తులసి ఆకుల్లో కార్మినేటివ్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఎసిడిటీ నుంచి మీకు తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇందుకోసం కొన్ని తులసి ఆకులను నమలండి. లేదా కప్పు నీటిని తీసుకుని 3  లేదా 4 ఆకులను వేసి మరిగించండి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఈ నీటిని తాగితే ఎసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 

సోంపు

భోజనం చేసిన వెంటనే కొద్దిగా సోంపును నమలండి. ఇది కడుపులో ఎక్కువ ఆమ్లం ఉత్పత్తి కాకుండా నిరోధిస్తుంది. ఈ సోంపు గింజలు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ గింజల్లో ఉండే నూనె అజీర్థి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడతుంది. ఈ సోంపు గింజలు మలబద్దకాన్ని తగ్గిస్తాయి. అందుకే ఎసిడిటీ సమస్య ఉన్నవారు తిన్న తర్వాత ఈ గింజలను నమలండి.
 

దాల్చినచెక్క

దాల్చిన చెక్క కడుపు ఆమ్లత్వాన్ని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియ, శోషణను మెరుగుపరుస్తుంది. దీంతో కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణవ్యవస్థ ఇన్ఫెక్షన్లను పోగొట్టడానికి దాల్చినచెక్క టీ ఎంతో ఉపయోగపడుతుంది. దాల్చినచెక్కలో ఎన్నో పోషకవిలువలుంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటుగా.. బరువును కూడా నియంత్రణలో ఉంచుతుంది. 
 

butter milk

మజ్జిగ

 మజ్జిగను ఆయుర్వేదంలో సాత్విక ఆహారంగా పరిగణిస్తారు. భోజనం హెవీగా చేసినప్పుడు లేదా మరీ స్పైసీగా ఉండే ఆహారాన్ని తిన్న తర్వాత భారీ లేదా కారంగా ఉండే భోజనం తిన్నతర్వాత ఎసిడిటీ సమస్య వస్తే.. వెంటనే ఒక గ్లాస్ మజ్జిగను తాగండి. దీనిలో లాక్టిక్ ఆమ్లం  ఉంటుంది. కడుపులో ఆమ్లాన్ని తగ్గిస్తుంది. ఈ మజ్జగకు నల్ల మిరియాలను లేదా టీ స్పూన్ కొత్తిమీర ఆకులను జోడించి కూడా తీసుకోవచ్చు. 
 

బెల్లం

చక్కెర కంటే బెల్లమే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.  బెల్లంలో మెగ్నీషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మన శరీర శక్తి స్థాయిలను పెంచుతుంది. అంతేకాదు ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. ఇది ఎసిడిటీకి దారితీసే ఆమ్లాన్ని కూడా తగ్గిస్తుంది. అందుకే భోజనం చేసిన తర్వాత చిన్నబెల్లం ముుక్కను తినండి. ఇది మీ శరీరం  సాధారణ ఉష్ణోగ్రతను నిర్వహించడానికి సహాయపడుతుంది. అలాగే పొట్టను చల్లగా ఉంచడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

click me!