బ్రెడ్ ఎక్కువగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా?

Published : Mar 20, 2022, 02:29 PM IST

White Bread : బ్రెడ్ ను మైదా పిండితో తయారుచేస్తారు. వీటిని ఎక్కువగా తింటే మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, ప్రోటీన్లు అందవు. ముఖ్యంగా ఈ బ్రెట్ డయాబెటిస్ పేషెంట్లకు ఏ మాత్రం మంచిది కాదు. వీరు వైట్ బ్రెడ్ ను తింటే వారి షుగర్ లెవెల్స్ పెరిగే ప్రమాదముంది. 

PREV
18
బ్రెడ్ ఎక్కువగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా?

White Bread : జ్వరమొచ్చినా.. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా ఆ సమయంలో అన్నానికి బదులుగా ఎక్కువగా బ్రెడ్ నే తింటుంటారు. అంతేకాదు చాలా మందికి వీటిని చాయ్ లో ముంచుకుని తినే అలవాటు కూడా ఉంటుంది. అలాగే కొంతమంది ఫ్రూట్ జామ్ లు పెట్టుకుని తింటూ ఉంటారు. 
 

 

28

బ్రెడ్ చాలా సులువుగా అరుగుతుంది. అందుకే చాలా మంది వీటిని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతుంటారు. కానీ కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వైట్ బ్రెడ్ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు.  బ్రెడ్ లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు.
 

38

 
బ్రెడ్  తయారీలో ఎక్కువ శాతం మైడా పిండినే ఉపయోగిస్తారు. ఇవి మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. వీటిని ఎక్కువ మొత్తంలో తినడం వల్ల మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

48

అంతేకాదు బ్రెడ్ లో గ్లూటెన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీని వల్ల ఉదర సంబంధ రోగాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు వెయిట్ కూడా పెరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇక స్థూలకాయులు ఈ బ్రెడ్ కు ఎంత దూరంగా ఉంటే అంతమంచిది. 

58

బ్రెడ్ లో ఉండే గ్లూటెన్ మెదడుపై చెడు ప్రభావం చూపుతుందని పలు పరిశోధనల్లో స్పష్టం అయ్యింది.  బ్రెడ్ లో ఎక్కువ మొత్తంలో మైదా పిండి ఉంటుంది. ఇది తింటే మన శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, ప్రోటీన్లు అందవు.  

68

ఈ బ్రెడ్ డయాబెటిస్ పేషెంట్లకు ఏ మాత్రం మంచిది కాదు. వీటిని తింటే వీరి రక్తంలోని షుగర్ లెవెల్స్ లో మార్పులు వస్తాయి. దీనివల్ల హార్ట్ ఎటాక్, రక్తపోటు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. 

78

ఈ బ్రెడ్ లల్లో ఉప్పు క్వాంటిటి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దాంతోనే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బ్రెడ్ ను మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా తింటే శరీరంలో కేలరీలు చేరతాయి. 

88

వీటిలో శుద్ధి చేసిన షుగర్ నే వాడుతారు. వీటి వల్ల బరువు పెరుగుతారు.ఇది కొన్ని కొన్ని సార్లు మెదడులై చెడు ప్రభావం చూపే అవకాశం కూడా ఉంటుంది. వీటికి బరులుగా గోధుమలతో చేసిన బ్రెడ్ ను కానీ తృణధాన్యాలతో తయారుచేసిన బ్రెడ్ ను కానీ తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories