డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలియని వారుండరు. ఈ పండును ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో కాక్టస్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ పియర్ అని కూడా పిలుస్తారు. ఈ పండు తీయగా, టేస్టీగా ఉంటుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ కాక్టస్ మసాలాకు చెందింది. దీనిని పిటాయా అని కూడా పిలుస్తారు. ఈ పండులో యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్స్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. నిజానికి డ్రాగన్ ఫ్రూట్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది 48-52 మధ్య తక్కువ జిఐని కలిగి ఉంటుంది. అందుకే ఈ పండును మితంగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.