Railway Facility: మీరు ఎక్కాల్సిన రైలు క్యాన్సిల్ అయ్యిందా? లేటు అయ్యిందా? ఈ హోటల్ సర్వీస్ మీకే..!

Published : May 18, 2026, 07:37 PM IST

 Railway Facility: మనలో చాలా మంది రెగ్యులర్ గా రైలు ప్రయాణం చేస్తూనే ఉంటారు. అయినా కూడా.. రైల్వే అందించే చాలా సర్వీసుల గురించి తెలుసుకోరు.  అలాంటి బెస్ట్  సదుపాయాల్లో ఇది కూడా ఒకటి. 

PREV
13
Railway

ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు ఉద్యోగం, వ్యాపారాలు, లేదా వేరే ఏదైనా పని కోసమే రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారు. అయితే.. ప్రతిరోజూ రైలు ఒకే సమయానికి వస్తుంది అనే గ్యారెంటీ లేదు. ఒక్కోసారి వాతావరణ పరిస్థితులు లేదా ప్రమాదాల కారణంగా, మరేదైనా కారణం చేత అయినా రైళ్లు ఆలస్యం అవుతూ ఉంటాయి. లేదంటే.. ఒక్కోసారి రైలు క్యాన్సిల్ కూడా అవ్వొచ్చు. అలాంటి సమయంలో చాలా మంది ప్రయాణికులు రైల్వే స్టేషన్ లోనే గంటల కొద్దీ వేచి చూస్తూ ఉంటారు. మరి కొందరు.. అన్ని గంటలు స్టేషన్ లో ఉండలేక.. బయట ఏదైనా హోటల్ రూమ్ తీసుకొని అందులో ఉంటారు. అయితే.. అలా హోటల్ రూమ్ తీసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. అంతేకాదు.. వేడికీ, చలికీ స్టేషన్ లో గంటల తరబడి కూడా వేచి చూడాల్సిన అవసరం లేదు. రైల్వే అందిస్తున్న ఓ సదుపాయాన్ని హ్యాపీగా వాడుకోవచ్చు.

23
రైల్వే అందిస్తున్న సదుపాయం...

ప్రయాణికుల సౌలభ్యం కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( IRCTC) హోటల్ సౌలభ్యాన్ని కూడా అదిస్తుంది.ఇది చాలా మందికి తెలీదు. ప్రత్యేకంగా ప్రయాణికుల కోసం.. రిటైరింగ్ రూమ్ డార్మిటరీ సౌకర్యాన్ని అందిస్తోంది. అంటే.. ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో వసతి కల్పించడానికి ఇండియన్ రైల్వే ఈ రిటైరింగ్ రూమ్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఈ రూమ్స్ ని మనం చాలా తక్కువ ధరకే బుక్ చేసుకోవచ్చు. ఏసీ, నాన్ ఏసీ, సింగిల్, డబుల్, డార్మిటరీ తరహా గదులు అందుబాటులో ఉన్నాయి.

మీరు కనీసం ఒక గంట నుండి గరిష్టంగా 48 గంటల వరకు బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రాంతాన్ని బట్టి, రూమ్ బుకింగ్ ఛార్జీలు రూ.100 నుండి రూ.700వరకు ఉంటాయి. టికెట్ రిజర్వేషన్ చేసుకున్నవారు మాత్రమే ఈ రూమ్స్ బుక్ చేసుకోగలరు. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ప్రయాణికులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండదు. దేశంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్ లో రిటైరింగ్ రూమ్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ రిటైరింగ్ రూమ్ లను ఆఫ్ లైన్, ఆన్ లైన్ రెండింటిలోనూ బుక్ చేసుకోవచ్చు.

33
ఆన్‌లైన్ బుకింగ్...

IRCTC వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వండి

IRCTC అకౌంట్ విభాగానికి వెళ్లి, 'మై బుకింగ్' పై క్లిక్ చేయండి

క్రిందికి స్క్రోల్ చేయండి, మీకు 'రిటైరింగ్ రూమ్' ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి, మీ PNR నంబర్ , మీరు బస చేయాలనుకుంటున్న స్టేషన్ వివరాలను సమర్పించండి

తరువాత చెక్-ఇన్, చెక్-అవుట్ తేదీ, బెడ్ రకం... అడిగిన అన్ని వివరాలను ఇవ్వాలి

స్లాట్ వ్యవధి , ID కార్డ్ రకం వంటి వివరాలను సరిగ్గా తనిఖీ చేసి, చెల్లింపు చేయాలి

చెల్లింపు చేసిన తర్వాత మీ రూమ్ బుకింగ్ పూర్తవుతుంది

Read more Photos on
click me!

Recommended Stories