Home Cleaning: ఈ చిన్న ట్రిక్‍తో గంటల తరబడి చేసే పని చిటికెలో అయిపోతుంది

Published : May 18, 2026, 06:47 PM IST

Home Cleaning: ఇల్లంతా క్లీన్ చేయాలంటే రోజంతా కష్టపడాలి అని కంగారు పడుతున్నారా? అయితే టెన్షన్ పడొద్దు. ఈ చిన్న ట్రిక్‍తో గంటల తరబడి చేసే పనిని చిటికెలో ముగించేయండి. ఆ సూపర్ మ్యాజిక్ ఏంటో ఇక్కడ చూసేద్దాం.

PREV
15
కాస్త ఓపికతో కూడిన పనే

చాలా మంది పండక్కో, పబ్బానికో, 6 నెల్లకో ఇళ్లంతా శుభ్రం చేస్తారు. కానీ ఎండలు, గాలుల కారణంగా వేసవిలో ఇల్లు దుమ్ము పట్టేసి మురికిగా మారుతుంది. అందుకే నెలకు ఒకట్రెండు సార్లయినా క్లీనింగ్ అవసరం. ముఖ్యంగా కిచెన్ క్యాబినెట్లలో జిడ్డు, ఫ్యాన్లపై పేరుకున్న ధూళిని వదిలించడం కాస్త ఓపికతో కూడిన పనే. మరీ అంత శ్రమ లేకుండా సులువైన మార్గాలు ఇక్కడ చూద్దాం.

25
ఆ సులభమైన పద్ధతి ఏది?
కొన్నిసార్లు వీకెండ్ మొత్తం ఇల్లు శుభ్రం చేయడానికే సరిపోతుంది. కానీ ఇకపై ఆ అవసరం లేదు. ఎత్తులో ఉన్న ప్రదేశాలను శుభ్రం చేయడానికి ఇక్కడో మంచి ఐడియా ఉంది. దీనికోసం మీరు నిచ్చెనలు, స్టూల్స్ ఎక్కాల్సిన పనిలేదు. నిల్చున్న చోట నుంచే కిచెన్, అల్మారా, ఫ్యాన్లను సులభంగా క్లీన్ చేయొచ్చు. ఆ సులభమైన పద్ధతి ఏంటో చూద్దాం.
35
ఫ్యాన్, అల్మారా, కిచెన్ నిమిషాల్లో క్లీన్!

దీని కోసం స్పిన్ బకెట్ ఉన్న రౌండ్ క్లీనింగ్ మాప్ అయితే చక్కగా సరిపోతుంది. ఇది నీళ్లను బాగా పిండేసి, తుడవడానికి వీలుగా ఉంటుంది. ఇక క్లీనింగ్ లిక్విడ్ కోసం.. వేడి నీళ్లలో కొద్దిగా వంట సోడా, నిమ్మరసం కలపండి. దీనికి తోడుగా కొంచెం వాషింగ్ పౌడర్ లేదా లిక్విడ్ డిటర్జెంట్ కూడా వేసి బాగా మిక్స్ చేస్తే మీ హోమ్‌మేడ్ క్లీనర్ రెడీ. 

45
రుద్దకుండానే మరకలు మాయం!

ఇప్పుడు మీరు తయారు చేసుకున్న లిక్విడ్‌లో మాప్‌ను ముంచి, బాగా పిండాలి. మాప్‌లో ఎక్కువ నీళ్లు ఉండకూడదు, కేవలం తడిగా ఉంటే చాలు. ఇప్పుడు ఆ మాప్ పొడవాటి హ్యాండిల్ సహాయంతో కిచెన్‌లోని జిడ్డు క్యాబినెట్లను నిమిషాల్లో శుభ్రం చేయవచ్చు. బెడ్‌రూమ్ అల్మారాలు, తలుపులు, స్లైడింగ్ డోర్లను కూడా దీంతో ఈజీగా తుడవొచ్చు. ఫ్యాన్లను కూడా నిల్చున్న చోట నుంచే క్లీన్ చేయొచ్చు. మాప్ మురికిగా అయినప్పుడు, దాన్ని మంచి నీటిలో ఉతికి, మళ్లీ లిక్విడ్‌లో ముంచి వాడుకోవాలి.

55
విదేశాల్లో ఇలాగే క్లీన్ చేస్తారు

ఈ పద్ధతితో మీరు కేవలం 15-20 నిమిషాల్లోనే ఇల్లంతా శుభ్రం చేయవచ్చు. మీ దగ్గర ఈ మాప్ లేకపోతే, వైపర్‌కు ఒక కాటన్ క్లాత్ చుట్టి కూడా ఈ పని చేయొచ్చు. కానీ అన్నింటికంటే రౌండ్ మ్యాజిక్ మాప్ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. దీనికున్న సాఫ్ట్ క్లాత్ దుమ్ము, జిడ్డును సులభంగా పీల్చుకుంటుంది. విదేశాల్లో చాలామంది ఇలాగే స్మార్ట్‌గా ఇల్లు క్లీన్ చేసుకుంటారు. 

Read more Photos on
click me!

Recommended Stories