ఉత్తరాది పుణ్యక్షేత్రాల టూర్ టికెట్ ధరలివే..
ఉత్తరాది పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ప్రకటించిన భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ రైలులో మీ బడ్జెట్‌కు తగినట్లు వివిధ క్లాస్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
స్లీపర్ క్లాస్ (ఎకానమీ) : ఒక్కొక్కరికి రూ. 16,500 (5-11 ఏళ్ల పిల్లలకు రూ. 15,400)
థర్డ్ ఏసీ (3AC) : ఒక్కొక్కరికి రూ. 25,600 (పిల్లలకు రూ. 24,300)
సెకండ్ ఏసీ (2AC) : ఒక్కొక్కరికి రూ. 33,400 (పిల్లలకు రూ. 31,800)
ఈ 10 రోజుల యాత్రలో కేవలం ప్రయాణం మాత్రమే కాదు అనేక సౌకర్యాలు ఉంటాయి. స్థానికంగా తిరగడానికి వాహనాలు, వసతి, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం (శాకాహారం), టూర్ గైడ్ సేవలు, ప్రయాణ భీమా వంటి అనేక సౌకర్యాలు ఈ ప్యాకేజీలో భాగంగా ఉంటాయి.