International Beer Day 2022: బీర్ గురించి మీకు ఈ నిజం తెలుసా..?

Published : Aug 05, 2022, 10:08 AM IST

International Beer Day 2022: బాధొచ్చినా.. సంతోషమొచ్చినా.. చాలా మందికి గుర్తొచ్చేది బీరే. అందుకేనేమో.. ప్రపంచంలోని ఎక్కువ మంది తాగే పానీయాల్లో బీర్ మూడో ప్లేస్ కొనసాగుతోంది. మరి ఈ బీర్ డే సందర్భంగా దీని పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుందాం పదండి..   

PREV
16
International Beer Day 2022: బీర్ గురించి మీకు ఈ నిజం తెలుసా..?

మండుతున్న ఎండలకు చల్ల చల్లగా ఉండే బీర్ తో చిల్ అవ్వాలని కోరుకోని అబ్బాయిలు ఉండరేమో.. పెద్ద వయసు వారి నుంచి యువకుల వరకు అందరూ ముందుగా బీర్లనే తాగడానికి ఇష్టపడతారు. అందులోనూ బీర్లు ఇప్పుడిప్పుడే తయారైన పానీయం కాదు.. కొన్ని ఏండ్ల నుంచీ దీన్ని వినియోగిస్తున్నారు. అంతర్జాతీయ బీర్ దినోత్సవాన్ని 2007లో కాలిఫోర్నియాలోని శాంటా క్రూజ్‌ కు చెందిన జెస్సీ అవ్ షాలోమోవ్న్అనే వ్యక్తి స్థాపించారు. అయితే ఈ ప్రత్యేకమైన రోజును 2012 వరకు ఆగస్టు 5న జరుపుకునే వారు. దీనిని తర్వాత ఆగస్టు మొదటి శుక్రవారానికి మార్చారు. ఈ రోజును ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 80 కి పైగా దేశాలు సెలబ్రేట్ చేసుకుంటాయి. వీటిలో మన ఇండియా కూడా ఉంది. 
 

26

ప్రపంచ బీర్ దినోత్సవం సందర్భంగా ఈ రోజు బీర్  తయారీలో పాల్గొన్నవారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. నిజానికి ఈ రోజు బీర్ ప్రేమికులకు పండగనే చెప్పాలి. పులియబెట్టిన బార్లీ, సుగంధ ద్రవ్యాలతో పానీయాన్ని ఉత్పత్తి చేసినట్టు కనుగొన్నప్పటికీ .. బీర్ ఎంతో ప్రజాధారణ పొందింది. పురాతన ఈజిప్టులోని ప్రజలు కూడా బీర్ ను వినియోగించారన్న ఆధారాలు ఉన్నాయి. మధ్య యుగాల నాటికి.. క్రైస్తవ సన్యాసులు కూడా బీరును తయారు చేశారు. గతంలో బీర్ ను రుచికరంగా చేయడానికి ఖర్జూరాలను, ఆలివ్ ఆయిల్ వంటి వాటిని ఉపయోగించే వారు. ఈ బీర్ ను ఇంకా ఎక్కువ రుచికరంగా చేయడానికి  మూలికలు లేదా పండ్ల ను కూడా వినియోగించారు.

36

భారత దేశంలో బీర్ ప్రయాణం

బీరుకు సంబంధించిన ప్ర‌య‌త్నాలు భార‌త్ లో శతాబ్దాల క్రితమే ప్రారంభ‌మ‌య్యాయి. క్రి.పూ 1500 లో పులియబెట్టిన బార్లీ, బియ్యం ఆధారిత పానీయాలు స్థానిక పండ్లు, సుగంధ ద్రవ్యాలతో రుచిగా ఉండే బీర్లు త‌యారు చేశారు. అయితే  1700 ల చివరలో భారతదేశంలోని వాతావరణ పరిస్థితులు బీర్ తయారు చేయడానికి అనుకూలంగా లేనందున.. భారతదేశంలో పేల్ అలెస్, పోర్టర్లను బ్రిటిష్ వారు ఎక్కువగా వినియోగిస్తున్నారు.  ఇది ఆల్కహాల్ కంటెంట్- దాని హాప్ ప్రొఫైల్లో అధికంగా ఉన్న కొత్త  ర‌కాల‌ను త‌యారు చేయ‌డానికి దారితీసింది. 1800, 1900 ల ప్రారంభంలో నల్లమందు, బ్రాందీ, క్లారెట్, విస్కీ-జిన్ వంటివి పుట్టుకువ‌చ్చి బీర్ ను భ‌ర్తీ చేశాయి. ఇక బ్రిటిష్ వారు భార‌త్ ను వ‌దిలి వెళ్లిన త‌ర్వాత.. ప్ర‌పంచవ్యాప్తంగా  అందుబాటులో ఉన్న వాటిని దృష్టిలో ఉంచుకుని స్థానిక శైలీకి అనుగుణంగా బీర్ల‌ను త‌యారు చేయ‌డం ప్రారంభించారు. స్ట్రాంగ్, లైట్‌, క‌ల‌ర్స్ వేరియంట్ల‌తో బీర్లను తీసుకువ‌చ్చాయి. నేడు భార‌త్ లో  మాల్టెడ్ బార్లీ, హాప్స్, ఈస్ట్, నీరు మిశ్రమాల బీర్ల‌తో పాటు గోధుమలతో త‌యారు చేసిన బీర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
 

46
beer

100 సంవత్సరాల కిందట డానిష్ రసాయన శాస్త్రవేత్త సోరెన్పీడర్ లారిట్జ్ (S.P.L.) సోరెన్సెన్ డెన్మార్క్ లోని కార్ల్స్ బర్గ్ ప్రయోగశాలల్లో సంవర్గమాన పిహెచ్ స్కేలును అభివృద్ధి చేశాడు. పి.హెచ్. స్కేలు బీర్ ఆమ్లత లేదా క్షారత్వాన్ని కొలుస్తుంది. ఈ ఆవిష్కరణ పరిశ్రమకు అత్యంత ముఖ్యమైన సహకారాలలో ఒకటిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది బీర్ ఫైనల్ రుచిని గుర్తించడంలో సహాయపడతుంది. 

56

బీర్ రుచిని ఇష్టపడని వారుండరు. అందుకే ఇది  అత్యంత ప్రజాదరణ పొందిన పానీయంగా గుర్తింపు పొందింది. ఆసక్తికలిగించే విషయం ఏమిటంటే.. ప్రప౦చవ్యాప్త౦గా ప్రతీ స౦వత్సర౦ దాదాపు 50 బిలియన్ గ్యాలన్ల బీర్లను తాగుతున్నారట. బీర్ ను దాదాపుగా అన్ని కాలాల్లో తాగొచ్చు. కొందరు వీటిని సమయ సందర్భం చూసుకుని తాగితే మరికొంతమంది మాత్రం ఎలాంటి కారణాలు లేకుండా తాగుతారు. 
 

66
beer

ఇక అంతర్జాతీయ బీర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనాలు బార్లు, పబ్బులు, బ్రూవరీల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో జరుపుకుంటారు. బీర్ ఆల్కహాలే అయినప్పటికీ ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. ఇక ఫైనల్ గా బీర్ ఆరోగ్యానికి మంచిదని.. ఈ రోజు బీర్ డే అని ఎక్కువ మొత్తంలో తాగితే మాత్రం ఆరోగ్యం దెబ్బతింటుంది జాగ్రత..

Read more Photos on
click me!

Recommended Stories