Train: మన దేశంలో మహిళల కోసం ప్రత్యేక కోచ్ తెచ్చిన మొట్ట మొదటి రైలు ఏదో తెలుసా?

Published : Nov 05, 2026, 03:24 PM IST

Train: ఈ రోజుల్లో చాలా రైళ్లలో మహిళల కోసం స్పెషల్ కోచ్ లు ఉండటం చాలా కామన్ అయిపోయింది. కానీ, మొట్ట మొదటిసారి, ఏ రైలులో మహిళల కోసం స్పెషల్ కోచ్ ఏర్పాటు చేశారో తెలుసా?

PREV
13
వందేళ్ల క్రితమే...

ఈ రోజుల్లో మహిళలు కూడా.. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. ఇలాంటి సమయంలో ప్రత్యేకంగా మహిళలకు రైళ్లో స్పెషల్ కోచ్ ఉండటం పెద్ద విషయం కాదు. కానీ, మహిళలు ఒంటరిగా ఇల్లు దాటి బయటకు వెళ్లడానికే ఎన్నో సంకోచాలు, ఆంక్షలు ఉండేవి. అలాంటి రోజుల్లోనే 100 ఏళ్ల క్రితమే.. మహిళల కోసం రైల్లో స్పెషల్ కోచ్ ఏర్పాటు చేశారు అని తెలుసా? ఆ రైలు ఏది? అసలు, మొదటి సారి ఏ రైలులో మహిళల కోసం స్పెషల్ కోచ్ ఏర్పాటు చేశారు? అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది..?

1930లో మొదటి సారి.. మహిళల ప్రయాణ హక్కు, వారి భద్రత అత్యంత ముఖ్యం అని చాటి చెబుతూ.. భారతీయ రైల్వే చరిత్రలో ఒక విప్లవాత్మకమైన అడుగు పడింది. ఈ చరిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుట్టిన ఐకానిక్ రైలు ‘ దక్కన్ క్వీన్’. ముంబయి- పూణే మధ్య దాదాపు శతాబ్దకాలంగా పరుగులు తీస్తున్న ఈ రైలు వెనక కథేంటో ఇప్పుడు చూద్దాం....

23
మహిళల స్వేచ్ఛ కోసం...

1930 జూన్ 1 న మొదటిసారి దక్కన్ క్వీన్ రైలు పట్టాలు ఎక్కింది. ఆ సమయంలోనే.. మహిళల కోసం..ప్రత్యేకంగా ఓ కోచ్ ఏర్పాటు చేశారు. నిజానికి ఆ సమయంలో మహిళలు ఒంటరిగా సుదూర ప్రాంతాలకు రైలు ప్రయాణం చేయడం చాలా అరుదు. కానీ, ఆ సమయంలోనే మహిళల భద్రత కోసం ఆలోచించారు. వారు ఏ మాత్రం భయపడకుండా, సురక్షితంగా సాగాలనే ఉద్దేశంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మహిళల స్పెషల్ కోచ్ పుణ్యమా అని ముంబయి, పూణే నగరాల మధ్య చదువుకోవడానికి వెళ్లే విద్యార్థినులు, ఉద్యోగినుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇది అప్పట్లోనే మహిళా సాధికారతకు పెద్ద పీట వేసింది.

33
దక్కన్ క్వీన్ వెనక కథ...

పుణే నగరాన్ని ప్రజలు ప్రేమగా క్వీన్ ఆఫ్ ది దక్కన్ అని పిలుస్తారు. దక్కన్ పీఠభూమి లోని ఈ నగరానికి ముంబయి నుంచి ప్రయాణికులను చేరవేసే రైలు కావడంతో దీనికి దక్కన్ క్వీన్ అనే పేరు వచ్చింది. ఈ రైలు మొదట్లో.. బొంబాయి వాసులు పూణేలో శని, ఆదివారం జరిగే గుర్రపు పందేల కోసం మాత్రమే నడిపేవారు. తర్వాతర్వాత.. నిత్యం వాడటం మొదలుపెట్టారు.

ఘాట్ అందాలు..

మహిళల కోచ్ మాత్రమే కాకుండా.. ఈ రైలులో ప్రయాణం కూడా చాలా అందంగా ఉంటుంది. ముంబయి- పూణే మార్గంలోని భోర్ ఘాట్ కొండలు, దట్టమైన లోయలు, జలపాతాల గుండా వెళ్తుంటే.. ఈ రైలు ప్రయాణం చాలా అందంగా కనిపిస్తాయి. అంతేకాదు, ఆ కాలంలోనే ఈ రైలులో ప్రత్యేకంగా డైనింగ్ సౌకర్యాన్ని అందించిన ఘనత కూడా ఈ దక్కన్ క్వీన్ రైలు కే దక్కుతుంది. ఇప్పటికీ.. ఈ సదుపాయం కొనసాగుతోంది. చాలా రుచికరమైన ఆహారాన్ని ఇక్కడ అందిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories