Diwali 2026: దీపావళికి దీపాలు ఆరకుండా ఎక్కువసేపు వెలుగుతూ ఉండాలంటే.. ఈ చిన్న పని చేయండి

Published : Nov 05, 2026, 01:42 PM IST

Diwali 2026: దీపావళికి ఇంటి ముందు దీపాలు పెడతారు. కానీ ఒక్కోసారి దీపాలు త్వరగా ఆరిపోతుంటాయి. అవి చక్కగా ఎక్కువసేపు వెలగాలంటే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

PREV
13
దీపావళికి దీపాలు

దీపావళి పండుగ అంటేనే వెలుగుల వేడుక. ఆ రోజు ఇళ్ల ముంగిళ్లు, బాల్కనీలు, డాబాలపై దీపాలు పెట్టి అందంగా అలంకరిస్తుంటారు. అయితే ఆరుబయట ప్రమిదలు పెట్టినప్పుడు కాస్త గాలి వీచినా అవి వెంటనే ఆరిపోతుంటాయి. పదే పదే వెలిగించడం ఇబ్బందిగా మారుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా సోషల్ మీడియాలో ఒక కొత్త చిట్కా తెగ వైరల్ అవుతోంది. మహిళలు గోళ్లకు వేసుకునే నెయిల్ పాలిష్‌తో దీపాలు ఎక్కువసేపు నిరంతరాయంగా వెలిగేలా చేయవచ్చని నెటిజన్లు చెబుతున్నారు.

23
ఈ చిట్కా పాటించండి

ఈ చిట్కా కోసం వత్తిని ప్రమిదలో వేసి నూనె పోసే ముందు చిన్న పని చేయాలి. వత్తి చివర మంట వెలిగించే పైభాగంలో ఏదైనా నెయిల్ పాలిష్ కొద్దిగా పూయాలి. అది కాసేపు ఆరిన తర్వాత ప్రమిదలో నూనె పోసి వెలిగించాలి. నెయిల్ పాలిష్‌ తొందరగా మంటను అందుకునే గుణం కలిగి ఉంటుంది. దీనివల్ల వత్తి త్వరగా వెలగడమే కాకుండా గాలిని తట్టుకుని నిలకడగా ఎక్కువ సమయం వెలుగుతుందని చాలామంది అంటున్నారు. బాల్కనీల్లో, డాబాలపై దీపాలు తరచూ ఆరిపోకుండా ఉండటానికి ఈ ఉపాయం బాగా ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు.

33
ఈ జాగ్రత్తలు తీసుకోండి

ప్రమిదలు ఎక్కువసేపు వెలగాలంటే కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. గాలి నేరుగా బలంగా తాకే ప్రదేశాల్లో కాకుండా మూలల్లో దీపాలు అమర్చాలి. వత్తి మరీ పొడవుగా లేదా మరీ చిన్నగా ఉండకుండా సరైన పరిమాణంలో ఉండేలా చూసుకోవాలి. ప్రమిదల్లో నూనె లేదా నెయ్యి తగినంతగా ఉండేలా నింపుతుండాలి. అన్నింటికంటే ముఖ్యంగా దుస్తులు, కర్టెన్లు వంటి త్వరగా మంటలు అంటుకునే వస్తువులకు దూరంగా, చిన్నపిల్లలకు అందకుండా సురక్షిత ప్రదేశాల్లో దీపాలను ఉంచడం ఎంతో మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories