ఆడ, మగవారిలో సంతానోత్పత్తిని పెంచే సూపర్ ఫుడ్స్..!

First Published Jan 29, 2023, 12:08 PM IST

గర్భం దాల్చడానికి సహాయపడే ప్రత్యేక ఆహారాలేమీ లేవు కానీ.. కొన్ని రకాల ఆహారాలు మాత్రం మీ సంతానోత్పత్తిని పెంచడానికి ఎంతో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 
 

సాల్మన్, బ్రోకలీ లేదా బ్లూబెర్రీస్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, కొవ్వు ఆమ్లాలు వంటి ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. పండ్లు, కూరగాయలు, సన్నని మాంసాలు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారాన్ని సూపర్ ఫుడ్ గా పిలుస్తారు. ఇలాంటి ఆహారాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. సంతానోత్పత్తి పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎగ్స్ నాణ్యత, స్పెర్మ్ నాణ్యతకు  సమతుల్య, విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. నిజం చెప్పాలంటే పెరిగిన ఒత్తిడి లేదా జీవనశైలిలో మార్పుల వల్ల గుడ్లు దెబ్బతింటాయి. దీనివల్ల గర్భం దాల్చడం కష్టంగా మారుతుంది. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సంతానోత్పత్తిని పెంచడానికి సహాయపడతాయి. సంతానోత్పత్తి పెరగాలంటే ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆకుకూరలు

ఆకు కూరల్లో ఎక్కువ మొత్తంలో ఫోలిక్ ఆమ్లం, విటమిన్ సి లు ఉంటాయి. ఈ రెండు అండోత్సర్గముకు ఎంతో సహాయపడతాయి. గర్భధారణ సమయంలో..  గర్భస్రావం, క్రోమోజోమ్ సమస్యల ప్రమాదాన్ని ఇవి తగ్గిస్తాయి. బచ్చలికూర, బ్రోకలీ, కాలే, మెంతికూర వంటి కూరగాయలను మీ రోజు వారి ఆహారంలో చేర్చండి. ఇవి స్పెర్మ్ నాణ్యతను పెంచడానికి కూడా సహాయపడతాయి.
 

డ్రై ఫ్రూట్స్, నట్స్

ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలకు ముఖ్యమైన వనరులు గింజలు, డ్రై ఫ్రూట్స్. వాల్ నట్స్ లో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఇవి గుడ్లలో క్రోమోజోమ్ నష్టాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. సెలీనియం వల్ల తగ్గిన నష్టం వల్ల సంతానోత్పత్తి పెరుగుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ మనుషుల్లో గుడ్డు ఏర్పడే అవకాశాలను పెంచుతుంది. అలాగే ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. సంతానోత్పత్తిని పెంచడానికి కొన్ని గింజలు, ఎండిన పండ్లను తప్పక తినండి.
 

tomatoes

టొమాటోలు

టమోటాల్లో ఉండే లైకోపీన్ పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ను 70 శాతం వరకు పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. శుక్ర కణాలు మరింత చురుగ్గా ఉండటానికి కూడా ఇవి సహాయపడతాయి. 
 

బ్రోకలీ

బ్రోకలీ హెల్తీ ఫుడ్. ఇది ఫోలిక్ ఆమ్లానికి గొప్ప మూలం. అందుకే గర్భందాల్చడానికి ప్రయత్నిస్తున్న వాళ్లు దీనిని తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన గర్భధారణకు ఫోలిక్ ఆమ్లం చాలా కీలకం. స్పైనా బైఫిడా వంటి సమస్యలను నివారించడానికి కూడా సహాయపడుతుంది. బ్రోకలీలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది అండాశయాల గుడ్ల అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి, అండోత్సర్గము అనుకున్న విధంగా జరిగేలా చూడటానికి కూడా సహాయపడుతుంది. 

అవోకాడోలు

అవోకాడోలు విటమిన్ ఇ కి అద్భుతమైన మూలం. ఇది స్పెర్మ్ చలనశీలతకు, ఫలదీకరణానికి బాగా సహాయపడుతుంది. వీర్యంలో గర్భస్రావానికి కారణమయ్యే జన్యుపరమైన లోపాలు ఉంటాయి. విటమిన్ ఇ ఈ డిఎన్ఎ లోపాలను తగ్గించడానికి సహాయపడుతుంది.

Image: Getty Images

గుమ్మడికాయ గింజలు

గుమ్మడికాయ గింజలల్లో ఉండే జింక్ పురుషులు, మహిళలు ఇద్దరిలో ఆరోగ్యకరమైన స్పెర్మ్, అండం అభివృద్ధికి తోడ్పడుతుంది. గుమ్మడికాయ విత్తనాలలో జింక్ తో పాటుగా ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు బఠానీలు, ఓట్స్ లో కూడా ఉంటాయి. 

click me!