ప్రోటీన్ మన శరీరానికి ఎంతో అవసరం. శరీరంలో సరిపడా ప్రోటీన్ ఉంటేనే మన బాడీ సక్రమంగా పనిచేస్తుంది. మన ప్రతి కణానికి ప్రోటీన్ అత్యవసరం కూడా. మన శరీరం కొవ్వులు, కార్బోహైడ్రేట్లు వంటి ప్రోటీన్లును నిల్వ చేయదు. అందుకే మీరు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువ మొత్తంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆహారాలు ఇది కండరాల పెరుగుదలకే కాదు ఎముకలు, కీళ్ళు, జుట్టు, ప్రతిరోధకాలు, హార్మోన్లు, ఎంజైమ్లకు కూడా అత్యవసరం.