ఆస్తమా పేషెంట్లు తినాల్సినవి, తినకూడని ఆహారాలు..

First Published Jul 3, 2022, 12:49 PM IST

ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో కొన్ని రకాల ఆహారాలు ఎంతో సహాయపడతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

asthma attack

ప్రస్తుత కాలంలో ఆస్తమా సర్వ సాధారణ వ్యాధిగా మారిపోయింది. దీనిబారిన ఎంతో మంది పడుతున్నారు. ఇది శ్వాసకోశ వ్యాధి. ఊపిరితిత్తులలోని చిన్న శ్వాసనాళాలు సన్నబడటం వల్ల ఈ ఆస్తమా వస్తుంది. ఈ సమస్య వల్ల రోగ నిరోధక శక్తి  (Immunity) తగ్గడంతో పాటుగా నిద్ర (sleep) కూడా సరిగ్గా ఉండదు. ఇది ఎన్నో ఇతర రోగాలకు దారితీస్తుంది. 

ఈ సమస్యనుంచి బయటపడేందుకు నిర్ధిష్టమైన ఆహారం లేదు. కానీ పోషకాహార లోపం ఉంటే మాత్రం ఈ సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

కొన్నిరకాల ఆహారాలు ఉబ్బసం లక్షణాలను తగ్గించడానికి సహాయపడతాయని పలు అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, మెగ్నీషియం (Magnesium), విటమిన్ సి, కెరోటిన్, విటమిన్ ఇ (Vitamin E), ఫ్లేవనాయిడ్లు, సెలీనియం వంటివి పుష్కలంగా ఉండే ఆహారాలను తినే వారికి ఈ సమస్య వచ్చే అవకాశం తక్కువగా ఉందని వెల్లడైంది. 

టమాటాలు, ఆపిల్, ద్రాక్ష వంటి పండ్లు తిన్నా పిల్లలో ఈ సమస్య వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

ఆస్తమా సమస్య ఉన్నవారు ఆరోగ్యకరమైన ఆహారాలనే తీసుకోవాల్సి ఉంటుంది. పోషకాలు పుష్కలంగా ఉండే కూరగాయలను, పండ్లను, చిక్కుళ్లను, తృణధాన్యాలను తీసుుకోవాలి. వీటితో పాటుగా ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే ట్యూనా (Tuna), అవెసె గింజలు, సార్డినెస్ (Sardines)లను తింటూ ఉండాలి. 

అలాగే అల్లం (ginger), బెర్రీలు, వెల్లుల్లి, బంగాళాదుంపలు (Potatoes), కొత్తిమీర, చెర్రీలు (Cherries), నారింజ, దానిమ్మ (Pomegranate), ఉల్లిపాయలు. క్యారెట్లు, బెర్రీలు (Berries), కివి పంటి వాటిని కూడా ఎక్కువగా తింటూ ఉండాలి. 

విటమిన్ డి (Vitamin D) ఎక్కువగా ఉండే ఆహారాలు నారింజ రసం, గుడ్లు (Eggs), పాలు ( milk)వంటి ఆహారాలు ఆస్తమా వల్ల కలిగే మంటను తగ్గిస్తాయి. అరటి పండ్లు (Bananas)కూడా ఆస్తమా పేషెంట్లకు మేలు చేస్తాయి. అరటిలో ఉండే పొటాషియం ఊపిరితిత్తులు మెరుగ్గా పనిచేసేలా సహాయపడుతుంది. 
 

విటమిన్ ఇ (Vitamin E) ఎక్కువగా ఉండే బ్రోకలి, ఆకు కూరలు, నట్స్ వంటి ఆహారాలు కూడా ఆస్తమా పేషెంట్లకు మంచివి. ఇవి శ్వాసలో ఇబ్బందిని తొలగిస్తాయి. 
 

యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, సెలీనియం ఎక్కువగా ఉండే ద్రాక్షపండ్లు (Grapes), ఆపిల్ (Apple) పండ్లు ఆస్తమా రోగులకు చాలా మంచివి. 

ఆస్తమా పేషెంట్లు తినకూడని ఆహారాలు

క్యాన్డ్ ఫుడ్ (Canned food), జంక్ ఫుడ్ (Junk food), ఫాస్ట్ ఫుడ్ (Fast food), ప్రాసెస్ చేసిన ఆహారాలను తినకపోవడమే మంచిది. వీటిని తింటే మంట, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. జ్యూస్ , పెస్ట్రీ, సోడా, క్యాండీలు, కేకులు, స్వీట్స్, Artificial sweetener లకు వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇవి ఆస్తమా లక్షణాలను మరింత పెంచుతాయి. ఎండిన పండ్లను తినకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

click me!