మన శరీరంలోని చాలా భాగాలు మన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేస్తాయి. వీటి మాదిరిగానే మన గోర్లు కూడా మన అంతర్గత ఆరోగ్యాన్ని తెలుపుతాయన్న సంగతి మీకు తెలుసా? అందుకే గోర్లను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. చాలా మంది అప్పుడప్పుడు మానిక్యూర్ తప్ప, గోర్ల సంరక్షణ కోసం ఏమీ చేయరు. అయితే కొంతమంది ఆడవారికి, మగవారికి గోర్ల రంగు మారుతుంది. లేదా గోర్లు విరిగిపోతుంటాయి. గోర్లు మీ చర్మం, కళ్ళు, జుట్టు మాదిరిగానే మీ ఆరోగ్య స్థితిని కూడా సూచిస్తాయి. నిలువు రేఖలు ఉన్న లేత గోర్లు రక్తహీనత లేదా పొడిబారడానికి సంకేతమంటున్నారు నిపుణులు. నీలి రంగు గోర్లు మీ రక్తంలో తగినంత ఆక్సిజన్ లేదని సూచిస్తాయి. మీ గోర్లు సన్నగా, ఎప్పుడూ విరిగిపోతే మీరు తగినంత విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లను తీసుకోవడం లేదని అర్థం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గోర్ల ఆరోగ్యాన్ని పెంచడానికి ఎలాంటి ఆహారాలను, సప్లిపెంట్లను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..