మీ పార్ట్ నర్ దగ్గర ఈ సీక్రెట్స్ మాత్రం దాచిపెట్టొచ్చు..!

First Published | Jan 28, 2023, 7:14 AM IST

అది వారికి చెప్పడం వల్ల... మీ మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది కాబట్టి... చెప్పకుండా ఉండటంలో ఎలాంటి తప్పు లేదు.

దాంపత్య జీవితం సజావుగా సాగాలంటే... దంపతుల మధ్య ఎలాంటి అరమరికలు లేకుండ ఉండాలని చెబుతూ ఉంటారు. అంతేకాదు... అన్ని విషయాలను పార్ట్ నర్ తో పంచుకోవాలని... ఎలాంటి దాపరికాలు ఉండకూడదని కూడా చెబుతుంటారు. కానీ... భాగస్వామి దగ్గర సైతం కొన్ని సీక్రెట్స్ దాచి పెట్టొచ్చట. అవేంటో ఓసారి చూద్దాం....

చాలా మందికి పెళ్లికి ముందే.... సెక్స్ పరంగా అనుభవం ఉండి ఉండొచ్చు. అయితే....  ఆ విషయం పార్ట్ నర్ దగ్గర దాచడంలో ఎలాంటి తప్పు లేదని నిపుణులు సూచిస్తున్నారు. అది వారికి చెప్పడం వల్ల... మీ మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది కాబట్టి... చెప్పకుండా ఉండటంలో ఎలాంటి తప్పు లేదు.


అందరికీ కొన్ని కొన్ని అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లలోనూ కొన్నింటిని అందరి ముందు ప్రదర్శించడం చాలా మందికి నచ్చదు. అలాంటి వాటి గురించి కూడా.. మీ భాగస్వామి చెప్పాలని లేకపోతే... చెప్పకుండా ఉండటమే మంచిది.


ఇక దాంపత్య జీవితం ఏ ఒక్కరికీ వడ్డించిన ఇస్తరిలా ఉండదు. ఏవో కొన్ని చిన్న చిన్న అనుమానాలు, సమస్యలు  ఉంటాయి. వాటిని మీ భాగస్వామి ముందు బయటపెట్టడం వల్ల.. ఏదైనా సమస్య వస్తుంది అనుకుంటే... వాటిని చెప్పకుండా ఉండటమే మంచిది.

అందరికీ అందరూ నచ్చాలని రూల్ ఏమీ లేదు. మీ భాగస్వామి నచ్చాడని.... వారి కుటుంబ సభ్యులందరూ కూడా మీకు నచ్చాలని రూలేమీ లేదు. అయితే....  ఆ విషయాన్ని మీ భాగస్వామితో వారు మీకు నచ్చరు అనే విషయాన్ని చెప్పకపోవడమే మంచిది.

చాలా మంది ఈ రిలేషన్ లోకి అడుగుపెట్టేముందు... గతం తాలూకు అనుభవాలు ఉంటాయి. అయితే... వాటిని మీ ప్రస్తుత భాగస్వామికి చెప్పాల్సిన అవసరం లేదు. అవి చెప్పడం వల్లే వారిలో అనుమానాలు మొదలై... సమస్యలు వస్తూ ఉంటాయి.

మీరు సెక్స్ లో పాల్గొన్నప్పుడు...ఇంతకన్నా గొప్ప అనుభూతిని తాను గతంలో అనుభవించాను అనే విషయాన్ని  మీ భాగస్వామితో పొరపాటున కూడా చెప్పొద్దు. దానిని సీక్రెట్ గానే ఉంచాలి.

మీ ఇంట్లో సభ్యులకు కూడా... మీ పార్ట్ నర్ లో కొన్ని నచ్చని విషయాలు ఉండొచ్చు. వారు వాటిని మీతో షేర్ చేసుకుంటే.... మీరు వాటిని మీ పార్ట్ నర్ కి చెప్పొద్దు. మా కుటుంబసభ్యులు మీ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు అని పార్ట్ నర్ కి తెలిస్తే... ఇబ్బందులు రావడం ఖాయం.
 

ఎంత భార్యభర్తలు అయినా.... ప్రతి ఒక్కరికీ పర్సనల్ సేవింగ్స్ ఉండాలి. వాటి గురించి మీరు మీ భాగస్వామికి చెప్పాల్సిన అవసరం లేదు. దానిని సీక్రెట్ గానే ఉంచాలి.

Latest Videos

click me!