dussehra: దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూడాలంటారు?

Published : Sep 28, 2025, 12:30 PM IST

dussehra: దసరా పండుగ నాడు ఏది ఏమైనా పాలపిట్టను చూడాలని చాలా మంది అనుకుంటారు. ఏ రోజు చూడకపోయినా దసరా నాడు చూస్తే చాలు అనుకునేవారు ఎంతో మంది. అసలు దసరకు, పాలపిట్టకు సంబంధం ఏంటి? ఈ రోజు ఈ పక్షిని ఎందుకు చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

PREV
15
పాలపిట్టను చూస్తే?

తెలంగాణ ప్రజలు జరుపుకునే పండుగల్లో దసరా చాలా పెద్ద పండుగ. ఈ పండక్కి తెలంగాణలోని ప్రతి ఒక్క ఇంట్లో పిండివంటల గుమగుమలు నోరూరిస్తాయి. ఆడపడుచులతో ఇండ్లు కలకలలాడుతుంటాయి. అయితే ఈ పండుగకి పాలపిట్టకు విడదీయరాని సంబంధం ఉంది. 

అదే ఈ రోజున ఖచ్చితంగా పాలపిట్టను చూడాలంటారు. ఈ రోజు పాలపిట్టను చూస్తే శుభసూచకంగా భావిస్తారు. అందుకే పాలపిట్ట కనిపిస్తుందని ఊరి చివర, చెట్లపై, పొలాల్లో, చెరువు గట్లపైకి వెళ్లి ఈ పక్షులను దర్శనం చేసుకుంటుంటారు. ఈ పక్షిని ఎవరైనా చూస్తే ఎంతో సంబురపడిపోతుంటారు. అసలు ఈ దసరా పండుగ నాడు పాల పిట్టను ఎందుకు చూడాలంటారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

25
దసరా నాడు పాలపిట్టను చూస్తే?

దసరా నాడు పాలపిట్టను చూడటం శుభప్రదంగా భావిస్తారు. అలాగే దీన్ని మంచి సూచకంగా భావిస్తారు. పాలపిట్ట చాలా చురుగ్గా కదులుతుంది. అలాగే ఈ పక్షి చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. కానీ మనకు చాలా తక్కువగా కనిపిస్తుంది. అయితే దసరా నాడు ఈ పక్షి ఏ టైంలో కనిపించిందనే దానిపై శుభ ఫలితాలు చెప్పబడతాయి. పండితుల ప్రకారం.. దసరా పర్వదినం మొదలయ్యే సమయానికి ఈ పక్షిని చూడటం శుభప్రదంగా భావిస్తారు.

దసరా పండుగను ఎందుకు జరుపుకుంటారు?

దసరా పండుగను విజయదశమి అనికూడా అంటారు. ఎందుకంటే ఈ రోజే మహిషాసురుడిపై దుర్గామాత విజయం సాధిస్తుంది. దీన్ని చెడుపై మంచి గెలుపునకు సూచికంగా చెప్తారు. అందుకే దసరా నాడు ఏ పనినైనా మొదలుపెడితే అది ఎక్కడా ఆగిపోకుండా విజయవంతమవుతుందని పండితులు చెప్తారు. అందుకే ఈ రోజు కనిపించే ప్రతి సంకేతం మనకు మన భవిష్యత్తు సూచికగా భావించాలంటారు.

35
ఈ కథ కూడా ఉంది

పాలపిట్ట గురించి రామయణంలోనూ ఉంది. అంటే రావణుడితో రాముడు యుద్దానికి వెళ్లేముందు పాలపిట్టను చూస్తాడట. దీంతో రాముడు రావణుడిని ఓడించి విజయం సాధించాడని చెప్తారు. అందుకే దసరా నాడు పాలపిట్టను చూస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారని అంటారు.

దసరా నాడు పాలపిట్టను ఎందుకు చూడాలంటారు?

మీకు తెలుసా? పాలపిట్టలు ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండవు. ఇవి కుటుంబం లేదా జంటగానే విహరిస్తుంటాయి. ఈ పాలపిట్టను సుఖశాంతికి, స్నేహం, ఐక్యత, ప్రేమకు ప్రతీకగా భావిస్తారు. ఈ రోజు పాలపిట్టను చూడటం వల్ల మనుషుల మధ్య ప్రేమాభిమానాలు, కుటుంబ బంధాలు బలంగా అవుతాయని పండితులు చెప్తారు.

 అలాగే ఈ రోజున పాలపిట్టను చూస్తే వచ్చే ఏడాది మీ జీవితంలో మీరు ఎన్నో విజయాలను చూస్తారు. అలాగే కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీ జీవితంలో ఎప్పుడూ సంతోషం వెల్లివిరుస్తుందని నమ్ముతారు. అలాగే ఈ రోజున పాలపిట్టను చూస్తే మనశ్శాంతి, అధ్యాత్మిక పురోగతి ఉంటుందని నమ్మకం ఉంది. అలాగే ఆత్మశుద్ధి అవుతుందని అని కూడా అంటారు.

45
ఉదయం పూట పాలపిట్ట కనబడితే..

దసరా పండుగ నాడు ఉదయం సమయంలో పాలపిట్ట కనబడటం చాలా మంచిదని చెప్తారు. దీన్ని ఎంతో శుభ సూచికంగా భావిస్తారు. ఉదయాన్నే పాలపిట్ట కనిపించడం నూతన ఆరంభానికి సంకేతంగా భావిస్తారు. ఉదయాన్నే పాలపిట్ట కనిపించిన వారికి చదువు, ప్రయాణం, వ్యాపారంతో పాటుగా ఏ పనైనా విజయవంతం అవుతుంది. ఎలాంటి ఆటంకాలు రావని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది.

మధ్యాహ్నం లేదా సాయంత్రం పాలపిట్ట కనబడితే..

మధ్యాహ్నం పూట పాలపిట్టను చూడటం కూడా శుభ సూచికమే. దసరా పండుగ నాడు మధ్యాహ్నం పాలపిట్టను చూసిన వారు.. తమ కష్టానికి త్వరలోనే ఫలితం పొందుతారని నమ్ముతారు. అలాగే దసరా పండుగనాడు సాయంత్రం వేళ పాలపిట్ట కనిపిస్తే మీ కుటుంబంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. అలాగే ఇంటిళ్లిపాది ఐక్యంగా, ఆరోగ్యంగా ఉంటారని చెప్తారు.

ఆధ్యాత్మికంగా పాలపిట్టను చూడటం

ఎవరికైతే పాలపిట్ట ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తుందో.. వారు తమ ఆత్మబలాన్ని పెంచుకోవాలని అర్థం. ముఖ్యంగా దసరా నాడు మీరు పాలపిట్టను చూడటం అంటే.. మీ ప్రార్థనలు, పూజలు, ధ్యానం ఫలించాయనే అర్థం. దుర్గాదేవి ఆశీస్సులు మీపై ఉన్నాయని అర్థమని పండితులు చెప్తారు.

55
పాలపిట్టను ఇలా చూస్తే..

దసరా పండుగ నాడు పాలపిట్టను మీ ఇంటి పక్కన ఎగురుతున్నప్పుడు చూస్తే మీ ఇంట్లో ఏదో మంచి జరగబోతుందని అర్థం. అలాగే మీరు శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. పాలపిట్టను జంటగా చూస్తే మీ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. 

ప్రేమాభిమానాలు బాగుంటాయి. పిల్లలకు పాలపిట్ట కనబడితే వారు చదువులో రాణిస్తారు. విజయాలు సాధిస్తారని అర్థం వస్తుంది. మొత్తంగా దసరా నాడు పాలపిట్టను చూడటం శుభప్రారంభం, విజయానికి సంకేతం.

Read more Photos on
click me!

Recommended Stories