Ragi Idli: మెత్తటి రాగి ఇడ్లీలు కావాలంటే ఇలా చేయండి, వెరీ సింపుల్ చిట్కా ఇదిగో

Published : Sep 16, 2026, 04:55 PM IST

Ragi Idli: ఇడ్లీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే రాగి పిండితో కూడా మెత్తటి ఇడ్లీ వండవచ్చు. దీన్ని వండడం చాలా సులువు. చిన్న చిట్కాలు పాటిస్తే మెత్తటి రాగి ఇడ్లీ సిద్దమైపోతోంది.

PREV
13
మెత్తటి రాగి ఇడ్లీలు

ప్రతిరోజూ ఒకేలాంటి ఇడ్లీలు తింటే బోర్ కొటేస్తుంది.. ఒక్కోసారి రాగి ఇడ్లీలు చేసుకుని తిని చూడండి. ఇవి గట్టిగా రాకుండా, దూదిలా మెత్తగా, తేలికగా రావడానికి సరైన కొలతలు, తయారీ విధానం తెలుసుకోవాలి. రాగి ఇడ్లీలు ఎలా చేయాలో తెలుసుకోండి.

23
రాగి ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు

రాగి పిండి – 1 కప్పు

ఇడ్లీ రవ్వ లేదా ఇడ్లీ బియ్యం – 1 కప్పు

మినప్పప్పు – 1 కప్పు

అటుకులు – ½ కప్పు (నానబెట్టినవి)

మెంతులు – ½ టీస్పూన్

కల్లుప్పు (రాక్ సాల్ట్) – సరిపడా

చల్లటి నీరు – రుబ్బుకోవడానికి తగినంత

33
రాగి ఇడ్లీ రెసిపీ

1. మినప్పప్పు, మెంతులను కలిపి 4 నుండి 5 గంటల పాటు నానబెట్టండి.ఇడ్లీ రవ్వ లేదా బియ్యం, అటుకులను కూడా విడిగా నానబెట్టండి.

2. మినప్పప్పును బాగా మెత్తగా, నురుగు వచ్చేలా రుబ్బుకోండి. మెత్తగా రుబ్బిన మినప్పిండిలో రాగి పిండి వేసి కలపండి.

3. ఆ మిశ్రమంలో నానబెట్టి పిండిన ఇడ్లీ రవ్వ/అటుకుల పేస్ట్ వేసి కలపండి. దీనికికల్లుప్పు (రాక్ సాల్ట్) కలిపితే పిండి బాగా పులుస్తుంది.

4. పిండి మరీ పల్చగా ఉండకూడదు, జారుగా ఉండాలి. ఈ మిశ్రమాన్ని మూతపెట్టి వెచ్చని ప్రదేశంలో 8 నుండి 12 గంటల పాటు పులియనివ్వండి.

5. పిండి పులిసిన తర్వాత గరిటెతో వేగంగా కలపకూడదు. లోపలి గాలి బుడగలు పోకుండా నెమ్మదిగా ఒక్కసారి కలపండి.

6. ఇడ్లీ ప్లేట్లలో ఈ మిశ్రమాన్ని వేసి మీడియం ఫ్లేమ్ 10 నుండి 12 నిమిషాలు ఆవిరిపై ఉడికించండి.

7. అంతే టేస్టీ రాగి ఇడ్లీలు మెత్తగా వచ్చేస్తాయి.ఒట్టి రాగి పిండితో చేస్తే ఇడ్లీలు రాయిలా గట్టిగా వస్తాయి. తప్పనిసరిగా మినప్పప్పు, ఇడ్లీ రవ్వ లేదా అటుకులను కలపాలి

Read more Photos on
click me!

Recommended Stories