నీతా అంబానీ రాయల్ ఈవెంట్స్ , రాయల్ వెడ్డింగ్స్ కోసం ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్ డిజైన్ చేసేది భారతదేశపు టాప్ ఫ్యాషన్ డిజైనర్లు మనీష్ మల్హోత్రా, అబు జానీ-సందీప్ ఖోస్లా.
ఆభరణాలు, డ్రెస్సింగ్: ఒక్కో అవుట్‌ఫిట్‌పై రియల్ గోల్డ్, రియల్ డైమండ్స్, జరీ వర్క్‌తో కోట్లాది రూపాయల ఖరీదైన రాయల్ డిజైన్స్‌ను కస్టమైజ్ చేస్తారు. వీరికి ఇచ్చే కస్టమైజేషన్ డిజైనింగ్ ఫీజు మాత్రమే లక్షల్లో ఉంటుంది.
అంతేకాదు.. ఈ పర్సనల్ టీమ్ మెంబర్స్ ప్రయాణించడానికి అంబానీ కుటుంబం ప్రత్యేకంగా ప్రైవేట్ జెట్ లేదా ఫస్ట్ క్లాస్ ట్రావెల్ సౌకర్యాలు, 7-స్టార్ హోటల్ అకామడేషన్ కూడా ఇస్తారు. ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి లేదా టాప్ ఐటీ ఉద్యోగి వార్షిక ప్యాకేజీ కంటే వీరి ఒక నెల ఆదాయమే చాలా ఎక్కువ ఉండడం గమనార్హం