Lower Berth: రైలు ప్రయాణంలో లోయర్ బెర్త్ కావాలని కోరుకుంటారు ఎక్కువమంది. కానీ అది అంత సులువుగా రాదు. అయితే కొంచెం తెలివిగా, సింపుల్ ట్రిక్స్ పాటిస్తే లోయర్ బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి.
రైలు టికెట్లు ఒకప్పుడు స్టేషన్ కు వెళ్లి లైనులో నిల్చొని తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఆన్ లైన్ సేవలు వచ్చాక పని చాలా సులువైపోయింది. రైళ్లలో సీట్లను ఆటోమేటిక్ కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ కేటాయిస్తుంది. ఇందులో మనుషుల ప్రమేయం ఉండదు. రైలు కదులుతున్నప్పుడు బ్యాలెన్స్‌గా ఉండేందుకు మొదట ఈ సాఫ్ట్‌వేర్ మిడిల్ బెర్త్‌లను కేటాయిస్తుంది. ఆ తర్వాతే లోయర్, అప్పర్ బెర్త్‌లను ఇస్తుంది. చివరగా సైడ్ బెర్త్‌లను కేటాయిస్తుంది.
24
‘రిజర్వేషన్ ఛాయిస్’ ఆప్షన్
అయితే వృద్ధులకు, మహిళలకు లోయర్ బెర్త్‌లు వస్తేనే ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీనికోసం టికెట్ బుక్ చేసేటప్పుడు కొన్ని స్టెప్స్ ఫాలో అయితే లోయర్ బెర్త్ వచ్చే అవకాశం ఉంది. టికెట్ బుకింగ్ సమయంలో 'రిజర్వేషన్ ఛాయిస్' (Reservation Choice) అనే ఆప్షన్‌లో 'Book Only if Lower Berth Allotted' అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇలా చేస్తే కంప్యూటర్ సిస్టమ్‌లో లోయర్ బెర్త్ ఖాళీగా ఉంటేనే మీ టికెట్ ను బుక్ చేస్తుంది. లేకపోతే టికెట్ బుక్ అవ్వదు. ముఖ్యంగా రైలు టిక్కెట్లు100 నుంచి 300 వరకు ఖాళీగా ఉన్నప్పుడే ఈ ట్రిక్ ఉపయోగపడుతుంది. వంద కన్నా తక్కువ టిక్కెట్లు ఉంటే లోయర్ బెర్త్ కోరుకున్నట్టు రాకపోవచ్చు.
34
‘సీనియర్ సిటిజన్' కోటా
మీరు వృద్ధులతో కలిసి ప్రయాణం చేయాల్సి వస్తే టికెట్లు బుక్ చేసేటప్పుడు 'సీనియర్ సిటిజన్' కోటాను ఉపయోగించాలి. ఈ కోటాను ఉపయోగిస్తే చాలామందికి లోయర్ బెర్త్‌లు వస్తయి. ఒకవేళ అప్పర్ బెర్త్ వచ్చినా బాధపడాల్సిన పనిలేదు. వృద్ధులు లేదా దివ్యాంగులు రైల్లో ఉండే TTEని సంప్రదిస్తే అతను లోయర్ బెర్త్‌లు ఖాళీగా ఉన్న చోట కేటాయిస్తారు. లేదా ఎవరైనా తమ సీటు మార్చుకోవడానికి ముందుకొచ్చినా ఆ సీటును మీకు ఇస్తారు.
ఇక చివర ట్రిక్ టికెట్ బుక్ చేసేందుకు మీరు 'సీనియర్ సిటిజన్' ఖాతాతో లాగిన్ అవ్వాలి. అంటే ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లో లాగిన్ అయిన వివరాలు సీనియర్ సిటిజన్ కు చెందినవై ఉండాలి. అప్పుడు కూడా లోయర్ బెర్త్ ఆప్షన్ కోరగానే ఆ బెర్త్ వచ్చే అవకాశం ఉంది.