అత్త, అల్లుడి మధ్య ఉన్న ఈ వింత బంధం గురించిన వీడియో బయటకు రావడంతో జనం నుంచి తీవ్రమైన స్పందనలు వస్తున్నాయి. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని, పరస్పర అంగీకారంతోనే కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నప్పటికీ, దీనిపై అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ లేదు.
ఈ పెళ్లికి సంబంధించి కుటుంబ సభ్యులు గానీ, మరెవరైనా గానీ ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఏదేమైనా సంప్రదాయ కుటుంబ సంబంధాల విలువలను ప్రశ్నించేలా ఉన్న ఈ ఘటన స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఈ అత్తాఅల్లుడు ఇష్టపూర్వకంగానే పెళ్లాడినట్లు వెల్లడించారు... తమ ఇష్టాన్ని గౌరవించి అందరూ పెళ్లిని అంగీకరించాలని కోరుతున్నారు.