Garlic Storage: ఇలా నిల్వ చేస్తే సంవత్సరమైనా వెల్లుల్లి తాజా ఉంటుంది, ఒక్క రెబ్బ కూడా పాడవ్వదు

Published : May 05, 2026, 10:59 AM IST

Garlic Storage:  మార్కెట్లో కొనుగోలు చేసిన వెల్లుల్లి వారం రోజులకే పాడైపోతుందా? పుచ్చు పట్టినట్లుగా మారుతుందా? అయితే  వాటిని నిల్వ చేసే పద్దతిలో నిల్వ చేస్తే.. సంవత్సరమైనా తాజాగా ఉంటాయి. 

PREV
13
వెల్లుల్లి..

భారతీయులు తమ వంటలో రెగ్యులర్ గా వెల్లుల్లి వాడుతూనే ఉంటారు. కూరల దగ్గర నుంచి పచ్చళ్ల వరకు ఇది ఉండాల్సిందే. వంటకు రుచి, కమ్మని సువాసన అందించడంతో పాటు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలో వెల్లుల్లి ముందు వరసలో ఉంటుంది.

చాలా మంది వెల్లుల్లిని ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి దానిని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. కానీ, సరిగా నిల్వ చేయకపోతే.. వెల్లుల్లి కుళ్లిపోతుంది.  అలా జరగకుండా ఉండాలంటే కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే సరిపోతుంది. సరిగా నిల్వ చేసే పద్దతులు ఏంటో ఓసారి చూద్దాం…

23
వెల్లుల్లి నిల్వ చేసే పద్దతి...

వెల్లుల్లి ఎక్కువ కాలం స్టోర్ చేయాలంటే, గాలి తగలని ప్రదేశంలో ఉంచకూడదు. ఉల్లిపాయలతో పాటు.. బయట గాలి తగిలేలా ఉంచాలి.  అంతేకాదు.. అవసరమైనప్పుడు మాత్రమే.. పొట్టు తీసి వాడుకోవాలి. 

వెల్లుల్లిని చల్లగా, పొడిగా ఉండే ప్రదేశంలో మాత్రమే నిల్వ చేయాలి.  తేమ తగలకుండా చూసుకోవాలి.  గాలి తగిలేలా ఉండే జాలి బుట్టలో పెట్టాలి.  వెల్లుల్లిని మూత పెట్టిన డబ్బాలో అసలు పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల తొందరగా కుళ్లిపోతాయి. మూసి ఉన్న డబ్బాలో పెడితే తొందరగా మొలకలు వచ్చే ప్రమాదం కూడా ఉంది.

33
పొట్టు తీసేసిన వెల్లుల్లి ఎలా స్టోర్ చేయాలి?

ఒకవేళ వెల్లుల్లి పొట్టు తీసి ఉంటే, దానిని గాలి తగలని డబ్బాలో పెట్టి.. ఫ్రిజ్ లో నిల్వ చేయాలి.  ఫ్రిజ్ లో పెట్టిన వెల్లుల్లిని కూడా వారం రోజుల్లోగా వాడేయాలి.   లేదంటే.. మీరు వెల్లుల్లిని ఎండలో పెట్టి పొడి రూపంలో చేసుకొని కూడా నిల్వ చేసుకోవచ్చు.

ఇలా కాదు అంటే…. మీరు వెల్లుల్లిని మెత్తటి పేస్టులాగా చేసుకొని ఫ్రీజర్ లో క్యూబ్స్ లా నిల్వ చేయాలి.  దీనిని జిప్ లాక్ బ్యాగ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు.  ఇలా పేస్టు చేసి ఫ్రీజర్ లో పెట్టుకుంటే.. కావాల్సినప్పుడు ఒక అరగంట ముందు బయట పెడితే సరిపోతుంది. కావాల్సినప్పుడు ఈజీగా వాడుకోవచ్చు. అంతేకాదు… వెల్లుల్లిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. పాడైపోయిన వెల్లుల్లి రెబ్బలను వెంటనే పారేయాలి. అప్పుడు మిగిలినవి కూడా పాడవ్వకుండా ఉంటాయి. 

Read more Photos on
click me!

Recommended Stories