Google Search: గూగుల్ లో ప్రతి విషయం గురించి వెతికే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రకాల విషయాలు వెతకడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. చివరికి జైలు పాలు కూడా కావాల్సి రావచ్చు.
ఇప్పుడు ఇంటర్నెట్ అందరికీ చాలా అందుబాటులో ఉంది. మనకు ఏ విషయం తెలుసుకోవాలన్నా వెంటనే గూగుల్‌లో వెంటనే టైప్ చేసేస్తాము. కానీ నిపుణులు చెబుతున్న ప్రకారం గూగుల్‌లో కొన్ని రకాల విషయాలు వెతికితే చట్టపరంగా నేరంతో సమానం. ముఖ్యంగా పేలుడు పదార్థాలు ఎలా తయారు చేయాలి? తుపాకులు ఎక్కడ నుంచి పొందాలి? హ్యాకింగ్ ఎలా చేయాలి? వంటి ప్రశ్నలను టైప్ చేస్తే వెంటనే అది అనుమానాస్పదంగా కనిపిస్తుంది. ఇలాంటి సెర్చ్‌లు ప్రభుత్వం, సైబర్ భద్రతా విభాగాల దృష్టిలోకి వచ్చే అవకాశం ఉంది.
24
పిల్లల విషయాలు వెతకొద్దు
ఇంకా అత్యంత ప్రమాదకరమైనది పిల్లలకు సంబంధించిన కొన్ని విషయాలను శోధించండి. పిల్లలకు హానికలిగించే విషయాల గురంచి సెర్చ్ చేయడం, పిల్లల అనుచిత వీడియోలు లేదా ఫోటోల కోసం వెతకడం భారత చట్టాల ప్రకారం తీవ్రమైన నేరం. ఇదే విధంగా మాదకద్రవ్యాలు ఎక్కడ దొరుకుతాయి? ఎలా తయారు చేస్తారు? నకిలీ డాక్యుమెంట్లు ఎలా తయారుచేయాలి వంటి విషయాలను సెర్చ్ చేయడం కూడా చాలా తప్పు. దీనికి చట్టం కఠిన శిక్షలు విధిస్తుంది. ఇలాంటి వెతికితే చేసైబర్ పోలీసు విభాగం IP అడ్రెస్ ద్వారా వ్యక్తిని గుర్తించగలదు.
34
మీకు నోటీసులు వచ్చే ఛాన్స్
సైబర్ నిపుణుల మాటల్లో, అనుమానాస్పద సెర్చ్‌లు గూగుల్‌లో కనిపిస్తే వాటిని భద్రతా సంస్థలు ప్రత్యేకంగా పరిశీలిస్తాయి. ఒకసారి ఇలాంటి సెర్చ్ మీరు చేసినట్టు రికార్డు అయితే ఆ వ్యక్తికి నోటీసు రావచ్చు. లేదా విచారణకు పిలవచ్చు.చట్టపరమైన కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. చాలా మంది ఆసక్తితో లేదా సరదాగా ఇవి టైప్ చేసినా అవే పెద్ద సమస్యలకు దారి తీస్తాయి. అందువల్ల గూగుల్ సెర్చ్‌ను సరైన పద్ధతిలో ఉపయోగించడం చాలా ముఖ్యం.
ఇంటర్నెట్ వాడే ప్రతీ వ్యక్తి గూగుల్‌లో ఏం సెర్చ్ చేస్తున్నారో జాగ్రత్తగా ఉండాలి. అవసరమైన, చట్టబద్ధమైన, సాధారణ సమాచారం కోసం మాత్రమే సెర్చ్ చేయడం మంచిది. చట్టవిరుద్ధంగా అనిపించే అనుమానాస్పదంగా కనిపించే పదాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఇంటర్నెట్ మనకు సహాయపడుతుందే తప్ప, తప్పుగా వాడితే సమస్యలు తెచ్చిపెడుతుంది. అందుకే ప్రతీ సెర్చ్ చేసే ముందు ఇది సురక్షితమేనా అని ఒకసారి ఆలోచించడం చాలా అవసరం.