Pudina plant: వేసవి కాలంలో మొక్కలు త్వరగా వాడిపోతాయి. పుదీనా మొక్కలైతే ఇంకా త్వరగా వాడిపోతాయి. కాబట్టి పుదీనా మొక్కకు ప్రత్యేకమైన నీటిని పోయడం ద్వారా అవి పచ్చని ఆకులతో పెరిగేలా చేసుకోవచ్చు.
వేసవిలో పుదీనా ఆకులను ఎక్కువగా వాడతాము. మజ్జిగలో, నిమ్మరసంలో పుదీనా ఆకులు వేసుకుంటే అది రుచిని పెంచడమే కాదు.. మంచి సువాసన కూడా అందిస్తుంది. చాలామంది ఇంట్లో పుదీనా మొక్కలు ఉంటాయి. కానీ వేసవిలో అవి త్వరగా ఎండిపోతాయి. జీవం లేని ఆకులు రుచిని కూడా కోల్పోతాయి. కాబట్టి పుదీనా మొక్క పెరగాలంటే ఒక చిన్న ట్రిక్ పాటిస్తే చాలు మొక్కకు ఆకులు దట్టంగా, నిండుగా పెరిగేలా చేయవచ్చు. దీనికోసం మీరు వాడాల్సి పటిక. ఇది మార్కెట్లో దొరుకుతుంది.
24
పటికను ఇలా వాడండి
నీటిలో పటికను వేసి బాగా కరిగేలా చేయాలి. లేదా పటికను పొడిలా చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఆ పొడిని నీటిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆ నీటిని పుదీనా మొక్క నాటిన కుండీలో వేయాలి. ఇలా కలపడం వల్ల మట్టి ఆమ్లంగా మారుతుంది. కుండీలోని మట్టి క్షారత్వం తగ్గిస్తుంది. అంటే పటిక మట్టిలోని పీహెచ్ స్థాయిలను తగ్గిస్తుంది. దీనివల్ల పుదీనా మొక్కకు అనుకూలమైన వాతావరణం ఏర్పడి అది పోషకాలను గ్రహించి పచ్చగా ఎదుగుతుంది.
34
పుదీనాతో లాభాలు
పుదీనా మొక్కలు ఇంట్లో పెంచితే ఎంతో మంచిది. పుదీనా వాసన కీటకాలకు నచ్చదు. కాబట్టి మీ ఇంటి చుట్టూ కీటకాలు రావు. కొన్నిసార్లు చీమలు, బూజు వంటివి పుదీనా మొక్క వేళ్ళకు పట్టొచ్చు. అలాంటప్పుడు కూడా పటిక నీటిని చల్లితే ఉపయోగం ఉంటుంది. పటికలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఎక్కువ. కాబట్టి ఇవి మొక్కను కీటకాలు, బూజు, చీమల నుండి రక్షించేందుకు ఉపయోగపడతాయి.
ఒక లీటరు శుభ్రమైన నీటిని తీసుకొని అందులో ఒక ముక్క పటికను వేయండి. పది నుండి పది పావుగంట సేపు నాననివ్వండి. ఒకవేళ పటిక పొడి రూపంలో ఉంటే అలాగే రెండు స్పూన్లు పటిక పొడిని వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ నీటిని పుదీనా వేర్లపై పొయ్యండి. ఈ నీటిని మొక్కపై చల్లకుండా మట్టికి మాత్రమే పోస్తే సరిపోతుంది. రెండు మూడు రోజుల్లోనే పుదీనా పచ్చగా పెరగడం మొదలవుతుంది.