Bitter Gourd: కాకరకాయ కూరలో ఈ పదార్థం వేశారంటే చేదే ఉండదు.. పిల్లలు కూడా తినేస్తారు

Published : Sep 27, 2026, 12:38 PM IST

Bitter Gourd: ఇంట్లో కాకరకాయ కూర వండితే పెద్దలు తప్పా.. పిల్లలు తినరు. కాకరకాయ అంటే ఆమడ దూరం పారిపోయే వాళ్లు కూడా చేదు లేకపోతే లొట్టలేసుకుని తింటారు. కాకరకాయలో ఏ పదార్థం వేయాలో తెలుసుకోండి.

PREV
13
కాకరకాయలో చేదు ఎలా పోవాలి?

ఇంట్లో కాకరకాయ కూర వండారంటే చాలా మంది ముఖాలు మాడిపోతాయి. వాటిని తినేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు. కొందరికి ఆ రుచి ఇష్టం, కానీ చాలామంది చేదు వల్ల దాన్ని పక్కన పెట్టేస్తారు. ముఖ్యంగా పిల్లలు కాకరకాయ తినేందుకు ఏమాత్రం ఇష్టపడరు. చేదు తగ్గించడానికి చాలామంది ముక్కలకు ఉప్పు పట్టించడం లేదా నూనెలో డీప్ ఫ్రై చేయడం చేస్తుంటారు. అయినా చేదు పూర్తిగా పోదు. అలాంటప్పుడు కూర వండేటప్పుడు కొద్దిగా మజ్జిగ వాడితే చేదు రుచి చాలా వరకు తగ్గుతుంది.

కాకరకాయ సహజంగానే చేదు రుచిని కలిగి ఉంటుంది. అందులో ఉండే కొన్ని రసాయనాల వల్లే ఆ చేదు వస్తుంది. ఎన్ని మసాలాలు దట్టించినా ఆ చేదును పూర్తిగా మార్చలేం. కానీ మజ్జిగ వాడటం వల్ల రుచి బ్యాలెన్స్ అవుతుంది. మజ్జిగలో ఉండే తేలికపాటి పులుపు.. కాకరకాయ చేదును చాలా వరకు తగ్గిస్తుంది.

23
రుచి ఎలా పెరుగుతుంది?

కాకరకాయ చేదు పోగొట్టడానికి ఎక్కువసేపు నూనెలో వేయిస్తే ముక్కలు డ్రైగా, గట్టిగా మారిపోతాయి. అదే మజ్జిగ వేస్తే ముక్కలకు తేమ అందుతుంది. సన్నని మంటపై ఉడికించడం వల్ల ముక్కలు సాఫ్ట్‌గా అవుతాయి. మజ్జిగ పులుపు, మసాలాలు కలిసి కూరకు మంచి రుచిని ఇస్తాయి. ఈ ట్రిక్ వాడితే మీరు కూరలో నిమ్మరసం లేదా ఆమ్ చూర్ పౌడర్ వేయాల్సిన అవసరమే ఉండదు.

33
మజ్జిగ ఎప్పుడు వేయాలి?

మీరు ఈ ట్రిక్ మొదటిసారి ట్రై చేస్తుంటే.. ముందుగా కాకరకాయ ముక్కలను మసాలాలతో సగం ఉడకనివ్వండి. ఆ తర్వాత కొద్దిగా తాజా మజ్జిగ వేసి సన్నని మంటపై ఉడికించండి. మరీ ఎక్కువ మజ్జిగ పోయకూడదు. సాధారణంగా చేసే కూరకు 2 నుంచి 3 టీస్పూన్ల మజ్జిగతో మొదలుపెట్టండి. అవసరమైతే మీ రుచికి తగ్గట్టు ఆ తర్వాత కొంచెం పెంచుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories