Fertility Crisis: ప్రమాదంలో మానవ జాతి? భవిష్యత్తులో పిల్లలు పుట్టడం కష్టమే.. ఏం జరుగుతోంది?

Published : May 06, 2026, 10:59 PM IST

Fertility crisis: ప్లాస్టిక్, కెమికల్స్ వాడకం వల్ల మనుషులు, జంతువుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతింటోంది. భవిష్యత్తులో పిల్లలు పుట్టడం కష్టమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఏం జరుగుతోంది?

PREV
15
ఆ ప్లాస్టిక్ వాడుతున్నారా? మీ సంతానోత్పత్తి సామర్థ్యం గోవిందా !

భవిష్యత్తులో పిల్లలు పుట్టడం కష్టమేనా? మానవ జాతి ఉనికి ప్రమాదంలో పడిందా? అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. మనం వాడుతున్న ప్లాస్టిక్, తింటున్న ఆహారంలోని కెమికల్స్, మారుతున్న వాతావరణం మనల్ని నిశ్శబ్దంగా నాశనం చేస్తున్నాయి. గడిచిన 50 ఏళ్లలో వన్యప్రాణుల సంఖ్య విపరీతంగా తగ్గిపోవడమే దీనికి నిదర్శనం. ఇప్పుడు అదే ముప్పు మనుషులకు కూడా చేరింది.

25
కెమికల్స్ దెబ్బతో హార్మోన్ల అసమతుల్యత

మన చుట్టూ ఇప్పుడు వేల సంఖ్యలో ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్నాయి. ఇవి నేరుగా మన బాడీలోని హార్మోన్ల మీద అటాక్ చేస్తున్నాయి. ముఖ్యంగా సింథటిక్ కెమికల్స్, ప్లాస్టిక్, ఫరెవర్ కెమికల్స్ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ గణనీయంగా తగ్గిపోవడానికి, మహిళల్లో గర్భధారణ సమస్యలు రావడానికి ఇవే కారణమని పరిశోధనల్లో తేలింది.

35
వన్యప్రాణులపై ఎఫెక్ట్

కేవలం మనుషులే కాదు, జంతువులు కూడా ఈ ముప్పును ఎదుర్కొంటున్నాయి. పీఎఫ్ఏఎస్, ఆర్గానోక్లోరిన్ కెమికల్స్ వల్ల పక్షులు పెట్టిన గుడ్ల నుంచి పిల్లలు బయటకు రావడం కష్టమవుతోంది. ఇక సముద్రాల్లో పెరిగిపోతున్న మైక్రోప్లాస్టిక్ వల్ల చేపల్లో గుడ్ల ఉత్పత్తి తగ్గిపోతోంది. దీనివల్ల చాలా జాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. మనం ప్రకృతిని పాడు చేస్తే, ఆ ప్రకృతి తిరిగి మన సంతానోత్పత్తిని దెబ్బతీస్తోంది.

45
గ్లోబల్ వార్మింగ్: వేడికి తగ్గిపోతున్న సామర్థ్యం

వాతావరణ మార్పులు లేదా క్లైమేట్ చేంజ్ కూడా దీనికి ప్రధాన కారణం. భూమి వేడెక్కడం వల్ల మన శరీరాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం, అధిక ఉష్ణోగ్రతల వల్ల జంతువులు, మనుషుల్లో రిప్రొడక్టివ్ స్ట్రెస్ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,40,000 రకాల సింథటిక్ కెమికల్స్ వాడుకలో ఉన్నాయి. వీటి ప్రభావం వల్ల రాబోయే తరాలు ఉంటాయా? లేదా అనే అనుమానం శాస్త్రవేత్తల్లో మొదలైంది.

55
పరిష్కారం ఏంటి? మనం ఏం చేయాలి?

శాస్త్రవేత్తల ప్రకారం, మనం ఇప్పుడే మేల్కొనకపోతే పరిస్థితి చేయి దాటిపోతుంది. ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత తగ్గించాలి. కెమికల్స్ భద్రతపై కఠినమైన పరీక్షలు నిర్వహించాలి. గాలి, నీటి కాలుష్యాన్ని అరికట్టడంతో పాటు వాతావరణ మార్పులను నియంత్రించాలి. లేకపోతే సైలెంట్ ఫెర్టిలిటీ సమస్య ఒక మహా సంక్షోభంగా మారి, మానవ జాతి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories