Hair Growth: మీ జుట్టు నెలరోజుల్లో ఒత్తుగా పెరగాలంటే ఇది వాడితే చాలు
life May 29 2026
Author: Nandini Arava Image Credits:Getty
Telugu
ఉసిరి ఒక దివ్యౌషధం
ఉసిరిలో విటమిన్ సి, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. జుట్టు ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి కుదుళ్లను బలపరచి హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. జుట్టు నల్లగా, మెరిసేలా ఉంచుతుంది.
Image credits: Getty
Telugu
జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది
ఉసిరికాయను తరచుగా వాడటం వల్ల జుట్టు వేర్లు దృఢమవుతాయి. ఇది తలకు పోషణ అందించి రక్తప్రసరణను మెరుగ్గా చేస్తుంది. ఫలితంగా జుట్టు ఊడిపోవడం తగ్గి, కొత్తవి పెరగడానికి సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
ఒత్తైన జుట్టు కోసం ఉసిరిని ఇలా వాడండి
చిన్నవయసులోనే తెల్లజుట్టు రాకుండా చేస్తుంది. జుట్టుకు సహజమైన మెరుపును అందిస్తుంది. ఆరోగ్యంగా, ఒత్తుగా పెరిగేందుకు ఉసిరిని ఎలా వాడాలంటే..
Image credits: Getty
Telugu
ఉసిరి పొడి, పెరుగు ప్యాక్
రెండు స్పూన్ల ఎండబెట్టిన ఉసిరి పొడిలో కొద్దిగా పెరుగు కలపండి. ఈ ప్యాక్‌ను తలకు, జుట్టుకు బాగా పట్టించండి.
Image credits: Getty
Telugu
ఉసిరి రసం, ఆలివ్ ఆయిల్
ఉసిరి రసం, ఆలివ్ నూనె కలిపి ప్యాక్ తయారు చేసుకోండి. ఈ ప్యాక్‌ను తలకు బాగా పట్టించి ఆరనివ్వండి. ఆరిన తర్వాత షాంపూతో తలస్నానం చేయండి.
Image credits: Getty
Telugu
ఉసిరి నీళ్లతో హెయిర్ వాష్
జుట్టు పెరుగుదలకు, ఉసిరికాయలు వేసి మరిగించిన నీటిని ఉపయోగించడం చాలా మంచిది. ఈ ఉసిరి నీళ్లను హెయిర్ వాష్‌గా కూడా వాడుకోవచ్చు.
Image credits: Getty
Telugu
ఉసిరి, కరివేపాకు పొడి
రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి, కరివేపాకు పొడిలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేయండి. దీనిని జుట్టుకు, మాడుకు పట్టించండి. బాగా ఆరిన తర్వాత కడిగేయండి.
Image credits: Getty
Telugu
ఉసిరి పొడి, మెంతుల పొడి
రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి, ఒక టేబుల్ స్పూన్ మెంతుల పొడిని నీటితో కలిపి పేస్ట్ చేయండి. దీనిని తలకు బాగా పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయండి.