1. నీటిలో నిల్వ చేయడం: నిమ్మకాయలను తాజాగా ఉంచడానికి ఇది సులభమైన మార్గాలలో ఒకటి. నిమ్మకాయలను ఒక ఎయిర్‌టైట్ కంటైనర్‌లో ఉంచి, అవి పూర్తిగా మునిగే వరకు నీటితో నింపాలి. కంటైనర్‌ను గట్టిగా మూసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల నిమ్మకాయలు వాడిపోకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
2. టిష్యూ పేపర్‌లో చుట్టడం: మొదట నిమ్మకాయలను కడిగి పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత ప్రతి నిమ్మకాయను విడివిడిగా టిష్యూ పేపర్‌లో లేదా న్యూస్‌పేపర్‌లో చుట్టి ఒక ఎయిర్‌టైట్ కంటైనర్‌లో లేదా జిప్-లాక్ బ్యాగ్‌లో పెట్టాలి. వీటిని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే వారాల తరబడి తాజాగా ఉంటాయి.
3. కొద్దిగా నూనె రాయడం: నిమ్మకాయలను కడిగి ఆరబెట్టిన తర్వాత, వాటి చర్మంపై కొద్దిగా ఆవనూనె లేదా ఏదైనా వంట నూనెను పలుచగా రాయాలి. ఆ తర్వాత వాటిని ఒక కంటైనర్‌లో వేసి ఫ్రిజ్‌లో భద్రపరచాలి. ఈ నూనె పొర తేమ ఆవిరి కాకుండా కాపాడుతుంది, దీంతో నిమ్మకాయలు ఎండిపోకుండా ఫ్రెష్‌గా ఉంటాయి. నిమ్మకాయలు వృథా కాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు కూడా ఈసారి ఎక్కువ నిమ్మకాయలు కొన్నప్పుడు ఈ సింపుల్ పద్ధతులను ట్రై చేసి.. తాజాగా ఉండేలా చూసుకోండి.