Jaggery Capital: మన దేశపు బెల్లం రాజధాని ఏదో తెలుసా? ప్రపంచంలోనే అతిపెద్ద బెల్లం మార్కెట్ ఇది

Published : Oct 23, 2026, 06:23 PM IST

Jaggery Capital: భారతీయులు ప్రతి ఇంట్లో పంచదార కన్నా కూడా ఎక్కువగా బెల్లమే వాడతారు. మరి, ఈ బెల్లం మన దేశంలో ఎక్కువగా ఎక్కడ పండిస్తారో తెలుసా? ప్రపంచంలోనే అతి పెద్ద బెల్లం మార్కెట్ మన దేశంలోనే ఉందని తెలుసా?

PREV
13
బెల్లం రాజధాని ఏది?

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో టీ, కాఫీ దగ్గర నుంచి స్వీట్ల వరకు అన్నింటికీ పంచదార వాడుతూ ఉన్నారు. కానీ, తెల్లటి రిఫైండ్ పంచదార మన కిచెన్ లోకి అడుగుపెట్టక ముందు..మన దేశంలో ప్రతి ఇంటా బెల్లమే ప్రధాన స్వీట్నర్. అన్ని రకాల స్వీట్లలో కేవలం బెల్లం మాత్రమే వాడేవారు. చెరకు రసాన్ని పెద్ద పెద్ద ఇనుప పెనాలలో, సంప్రదాయ పద్దతిలో.. బెల్లంగా మారుస్తారు. మరి మన దేశంలో బెల్లం రాజధానిగా ఏ నగరం పేరుగాంచింది..? దాని ప్రత్యేకత ఏంటో చూద్దాం...

23
భారత దేశపు బెల్లం రాజధాని....

ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ నగరం భారత దేశ బెల్లం వ్యాపారానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. ఇక్కడి మార్కెట్టే ప్రపంచంలోని అతి పెద్ద బెల్లం మార్కెట్ ఉంది. ఇక్కడి ప్రజలు చెరకును ఎక్కువగా పండిస్తారు. అందుకే.. ఉత్తరప్రదేశ్ ని ‘ షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా’ అని కూడా పిలుస్తారు.

ముజఫర్ నగర్ బెల్లానికి జీఐ ట్యాగ్ గౌరవం...

ఈ నగరానికి బెల్లంతో ఉన్న అనుబంధానికి అధికారిక గుర్తింపు కూడా లభించింది. 2023లో ముజఫర్‌నగర్ బెలానికి ప్రఖ్యాత జీఐ ట్యాగ్ (Geographical Indication) దక్కింది. అంతేకాదు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ 'వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్' పథకంలో కూడా ఇది చోటు సంపాదించుకుంది. 2025 మార్చిలో ఏకంగా 30 మెట్రిక్ టన్నుల జీఐ-ట్యాగ్డ్ ముజఫర్‌నగర్ బెల్లం బంగ్లాదేశ్‌కు ఎగుమతి కావడం విశేషం.

33
బెల్లం ఎలా తయారౌతుంది?

తాజా చెరకును కట్ చేసి, దాని నుంచి రసం తీస్తారు. ఆ రసాన్ని వడకట్టి, పెద్ద పాన్లలో వేసి మరిగిస్తారు. నీరంతా ఆవిరైపోయి చిక్కటి సిరప్ లాగా మారుతుంది. తర్వాత, దానిని చల్లార్చి... రకరకాల ఆకారాల్లో బెల్లాన్ని అచ్చు పోస్తారు.పంచదారలా కాకుండా, బెల్లంలో చెరకు రసంలోని సహజమైన మినరల్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఇది కేవలం స్వీట్ల తయారీలోనే కాకుండా, పచ్చళ్లు, సాంప్రదాయ పానీయాలలో కూడా విరివిగా వాడతారు.

Read more Photos on
click me!

Recommended Stories