Gulab Jamun Village: ఈ గ్రామంలోనే గులాబ్ జామ్ పుట్టింది.. ఇక్కడ తిన్న రుచి మరెక్కడా దొరకదు..!

Published : Oct 24, 2026, 09:10 AM IST

Gulab Jamun Village: అందరి ఫేవరేట్ స్వీట్ గులాబ్ జామూన్ కి ప్రత్యేకంగా ఓ గ్రామం ఉందని మీకు తెలుసా? ఈ గ్రామం చుట్టూ పక్కలకు ఎవరు వెళ్లినా.. ఈ స్వీట్ రుచి చూడకుండా ఉండలేరు.

PREV
13
గూలాబ్ జామ్ కి ఈ విలేజ్ ఫేమస్..

భారతీయ పెళ్లిళ్లు, పండగలు లేదా ఫ్యామిలీలో ఏ చిన్న వేడుక జరిగినా కూడా ముందు గుర్తుకు వచ్చే మొదటి స్వీట్ గులాబ్ జామ్. వేడి వేడిగా, పంచదార పాకంలో నానిన ఈ గుండ్రని మృదువైన స్వీట్.. చూసినా, కనీసం పేరు విన్నా కూడా నోరూరుతుంది. అయితే, ఈ కమ్మనైన స్వీట్ కి స్పెషల్ గా ఓ గ్రామం ఉంది. ఈ గ్రామం ఉత్తరప్రదేశ్ లో ఉంది. చూడటానికి చిన్న గ్రామం అయినా.. గులాబ్ జామ్ ల కోసమే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. అటుగా వెళ్లే ప్రయాణికులు ఎవరూ ఈ గ్రామంలో ఆగకుండా ఉండలేరు. అదే.. మైగల్గంజ్.

23
ఈ గ్రామం ఎక్కడ ఉంది?

ఉత్తరప్రదేశ్ లోని లిఖింపూర్ ఖేరీ జిల్లాలో ఉన్న మైగల్గంజ్ గ్రామం. ఢిల్లీ-లక్నో హైవేపై ప్రయాణించే వారికి ఈ గ్రామం సుపరిచితమే. హైవే పక్కన వరసగా సుమారు 25కి పైగా చిన్న చిన్న దుకాణాలు గులాబ్ జామ్ లు తయారు చేస్తూ కళకళలాడుతూ కనిపిస్తాయి. ఇక్కడ ప్రయాణికులు బండ్లు ఆపి మరీ.. వేడి వేడిగా ఈ స్వీట్ ని లొట్టలేసుకుంటూ ఆస్వాదిస్తారు.

ఈ గ్రామంలో గులాబ్ జామ్ ఎలా ఫేమస్ అయ్యింది?

ఈ ఊరికి గులాబ్ జామ్‌లతో ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. సరిగ్గా 1941లో 'ధన్‌పాల్ మిస్తాన్ భండార్' అనే షాపు ప్రారంభం కావడంతో ఈ చరిత్ర మొదలైంది. ఆ దుకాణంలో చేసిన గులాబ్ జామ్‌ల రుచి ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు ఎంతగానో నచ్చింది. క్రమంగా ఆ టేస్ట్ నచ్చి మరికొన్ని దుకాణాలు పుట్టుకొచ్చాయి. అలా 1970 నాటికి మైగల్గంజ్ అంటేనే గులాబ్ జామ్ అనేలా ఈ గ్రామం తన పేరును సంపాదించుకుంది.

33
ఇక్కడి గులాబ్ జామ్‌ల స్పెషాలిటీ ఏంటి?

మిగతా చోట్ల దొరికే వాటికి, ఇక్కడి వాటికి రుచిలో చాలా తేడా ఉంటుంది. ఈ స్వీట్ తయారీలో స్వచ్ఛమైనా కోవా, మైదా కలిపి తయారు చేస్తారు. వీటిని నూనెలో వేయించేటప్పుడు కూడా చాలా శ్రద్ధ తీసుకుంటారు. మొదట మంటను చిన్నగా ఉంచి, లోపల ఉడికేలా చేస్తారు. ఆ తర్వాత.. గులాబ్ జామ్ రంగు ఆకర్షణీయంగా మారడానికి కాస్త పెద్ద మంట మీద ఫ్రై చేస్తారు. సరిగ్గా పాకం పట్టిన తర్వాత, ఈ గులాబ్ జామ్‌లను ఎర్రటి మట్టి కుండీలలో వేడివేడిగా వడ్డిస్తారు. ఇక్కడ గులాబ్ జామ్ లకు ఉన్న రుచి.. మీకు మరెక్కడా దొరకదు.

Read more Photos on
click me!

Recommended Stories