Cooking Tips: కూర వండే ముందు.. కూరగాయల్ని ఎలా శుభ్రం చేయాలి?

Published : Oct 11, 2026, 07:18 PM IST

Cooking Tips: కూరగాయలు మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత.. వంట చేయడానికి ముందు వాటిని నీటితో శుభ్రం చేస్తాం. కానీ, ఆ కూరగాయలపై పేరుకున్న పురుగు ముందులు పోవాలంటే.. ఎలా శుభ్రం చేయాలి?

PREV
13
కూరగాయలు ఎలా శుభ్రం చేయాలి?

మనం రోజూ ఆరోగ్యం కోసం మార్కెట్ నుంచి రకరకాల కూరగాయలను తెచ్చుకుంటాం. వాటిని వంట చేసే ముందు నీటితో కడగడం అందరికీ తెలిసిన విషయమే. కానీ, కేవలం కుళాయి నీటి కింద కాసేపు కడిగితే వాటిపై ఉండే పురుగుల మందులు పోతాయా అంటే అస్సలు పోవు. క్రిములు, కీటకాల బారి నుంచి కూరగాయలను కాపాడేందుకు.. వాటిపై పురుగుల మందులు కొడుతూ ఉంటారు. అవి అంత తొందరగా వదలవు. వాటిని సరిగా శుభ్రం చేయకుండా వంట చేసి తినడం వల్ల.. అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మరి, అలా జరగకుండా ఉండాలంటే, వంట చేయడానికి ముందు.. కూరగాయలను ఎలా శుభ్రం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం...

23
కూరగాయలను కడగడానికి ఉప్పు నీరు ఎందుకు ఉపయోగించాలి?

ఉప్పు నీరు ఒక మైల్డ్ హైపర్టోనిక్ ద్రావణంగా పనిచేస్తుంది. ఇది కూరగాయలపై ఉండే కాలుష్యాలు, చిన్న పురుగులు, కొన్ని రకాల పురుగుల మందుల అవశేషాలను బయటకు లాగడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ముఖ్యంగా క్యాబేజీ, కాలీఫ్లవర్, పాలకూర వంటి పొరలు ఉండే లేదా ఆకుకూరల్లో లోపలికి ఇరుక్కుపోయిన మట్టిని ఇది సులభంగా వదిలిస్తుంది.

33
కూరగాయలను ఉప్పు నీటితో శుభ్రం చేసే సరైన పద్ధతి:

ఒక పెద్ద గిన్నెలో తగినన్ని శుభ్రమైన నీటిని తీసుకొని, లీటరు నీటికి 1 లేదా 2 టీస్పూన్ల సాధారణ ఉప్పు కలపాలి. ఉప్పు పూర్తిగా కరిగేలా కలపాలి. ఈ నీరు మరీ ఉప్పగా కాకుండా, తేలికపాటి ఉప్పు రుచిగా ఉండేలా చూసుకోవాలి. ఈ ఉప్పు నీటిలో కూరగాయలను శుభ్రం చేయడానికి ముందు.. నార్మల్ నీటితో ఒకసారి వాటిని శుభ్రం చేయాలి. ఆ తర్వాత.. ఈ ఉప్పు నీటిలో.. కూరగాయలను వేయాలి. కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే ఆ నీటిలో వదిలేయాలి. ఇలా వేయడం వల్ల.. ఆ కూరగాయల్లో ఉన్న మట్టి, రసాయనాలు పోవడంతో పాటు.. లోపల ఏమైనా పురుగులు ఉన్నా.. బయటకు వచ్చేస్తాయి.

ఇప్పుడు, ఈ ఉప్పు నీటిలో నానపెట్టిన కూరగాయ ముక్కలను నెమ్మదిగా చేతితో తేలికగా రుద్దాలి. ఆకు కూరలు అయితే.. నీటిలో తేలికగా కదిలించాలి. ఉప్పు నీటి నుండి కూరగాయలను బయటకు తీసి, మళ్లీ శుభ్రమైన పచ్చి నీటి కింద బాగా కడగాలి. దీనివల్ల మిగిలిపోయిన ఉప్పు, వదిలిన మట్టి , కెమికల్స్ పూర్తిగా కొట్టుకుపోతాయి.

నిల్వ చేసే ముందు ఆరబెట్టాలి: కడిగిన కూరగాయలను ఒక గిన్నెలో వేసి అదనపు తేమ ఆరిపోయేలా ఉంచాలి. అవసరమైతే పొడి గుడ్డతో తుడుచుకోవాలి. తడి లేకుండా ఉంటే కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

ఏ కూరగాయలను ఉప్పు నీటితో కడగాలి..?

ఆకుకూరలు: పాలకూర, మెంతికూర, లెట్యూస్ వంటివి.

పొరలు ఉండేవి: క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయలు.

గట్టి చర్మం ఉన్నవి: దోసకాయ, వంకాయ, క్యాప్సికం వంటివి.

భూమికి దగ్గరగా పెరిగేవి: నేలలో నేరుగా ఊరే లేదా పెరిగే రకాలు.

పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు: ఉప్పు నీరు కేవలం ఉపరితల రసాయనాలను తొలగిస్తుంది. కూరగాయల పైపొరలను తీసివేయడం, నమ్మకమైన చోట కూరగాయలను కొనుగోలు చేయడం ద్వారా భద్రతను మరింత పెంచుకోవచ్చు. కూరగాయలు పూర్తిగా మునిగేలా సరిపడా పెద్ద గిన్నెను ఉపయోగించండి. సున్నితమైన ఆకుకూరలను ఎక్కువ సేపు (15 నిమిషాలకు మించి) నానబెట్టవద్దు.ఎక్కువ సేపు నానపెడితే అవి పాడయ్యే ప్రమాదం ఉంది. ఉప్పు నీటిలో నానబెట్టిన తర్వాత ఎప్పుడూ మంచినీటితో కడిగిన తర్వాతే వంటకు ఉపయోగించండి.

Read more Photos on
click me!

Recommended Stories