Health Tips: ఈ పచ్చి కూరగాయలను తినడం ప్రమాదకరం..

Published : Jun 27, 2022, 12:40 PM IST

Health Tips: కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. అలా అని కొన్ని రకాల కూరగాయలను పచ్చిగా తినకూడదు. ఒకవేళ తింటే ఎన్నో సమస్యలు వస్తాయి.. 

PREV
16
Health Tips: ఈ పచ్చి కూరగాయలను తినడం ప్రమాదకరం..
vegetables

కూరగాయలను పచ్చిగా తింటే ఎన్నో పోషకాలు లభిస్తాయని చాలా మంది చెప్తుంటారు. అది నిజమే. కానీ కూరగాయల్లో వేటిని పచ్చిగా తినాలి? వేటిని తినకూడదు అన్న విషయాలు తెలిసి ఉండాలి. ఎందుకంటే అన్ని కూరగాయలను పచ్చిగా తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. అలా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

26

కొన్ని రకాల కూరగాయలను పచ్చిగా తింటే వాటిలో ఉండే పోషకాలు, మినరల్స్, విటమిన్లు పూర్తిగా అందవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ఇలాంటి కూరగాయలనెప్పుడూ ఉడకబెట్టి లేదా.. కాల్చుకునే తినాలి. అప్పుడే వాటిలో ఉండే పోషకాలు మనకు అందుతాయి. ఇంతకు ఎలాంటి కూరగాయను పచ్చిగా తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.. 

36

బెండకాయ.. బెండకాయ మన ఆరోగ్యనికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన కొన్ని పోషకాలు అందుతాయి. అయితే వీటిని మాత్రం పచ్చిగా అసలే తినకూడదు. ఎందుకుంటే బెండను పచ్చిగా తింటే కడుపులో తిమ్మిర్లు, జీర్ణశయాంతర, నరాల సమస్యలు వస్తాయి. బెండలో ఉండే సోలనిన్ దీనికంతటికి ప్రధాన కారణం. అందుకే బెండకాయలను ఎప్పుడూ ఉడికించే తినండి. పచ్చిగా మాత్రం తినకండి. 

46

పాలకూర: పాలకూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఫోలెట్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీన్ని పచ్చిగా తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

56

పుట్టగొడుగులు: పుట్టగొడుగులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే చాలా మంది పుట్టగొడుగులను ఎక్కువగా తింటుంటారు. అయితే వీటిని కూడా పచ్చిగా అస్సలు తినకూడదు. పచ్చిగా తింటే దీనిలో పోషకాలు మన శరీరానికి అందవు. వీటిని గ్రిల్ చేసుకుని తింటే మన శరీరంలో పొటాషియం లెవెల్స్ బాగా పెరుగుతాయి. 
 

66

బంగాళాదుంప: బంగాళాదుపంల్లో పోషకాలు చాలా ఉంటాయి. అయితే బంగాళా దుంపను పచ్చిగా తింటే దీనిలో ఉండే సోలనిన్ అనే టాక్సిన్ వాంతులు, వికారం, గ్యాస్ తో పాటుగా Digestive problems వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని ఉడికించి మాత్రమే తినాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  

Read more Photos on
click me!

Recommended Stories