Banana Peel: అరటి పండు తినేశాక తొక్క పడేస్తున్నారా? దానిలో ఎన్నో క్లీనింగ్ ఏజెంట్ లక్షణాలు ఉంటాయి. అరటి తొక్కలతో పాత్రలు కడిగారంటే తళతళ మెరిసిపోతాయి. జిడ్డును వదిలించే శక్తి దీనిలో ఉంటుంది.
వంటగదిలోని పాత్రలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. రోజూ వాడే గిన్నెలపై ఒక్కోసారి మొండి నూనె మరకలు, నల్లటి పొరలు ఏర్పడతాయి. వాటిని తోమేందుకు చాలా కష్టపడతారు. కానీ చాలా సులువుగా అరటి తొక్కలతో ఈ మరకలను తొలగించవచ్చు. అరటిపండ్లను తినేసిన తరువాత ఆ తొక్కలను పడేయకుండా వాటితో గిన్నెలు తోమేందుకు ప్రయత్నించండి. గిన్నెలకు పట్టిన నూనె మరకలు పోతాయి.
24
ఎలా ఉపయోగించాలి?
అరటి తొక్కలోని తెల్లటి భాగంలో పొటాషియం, కొన్ని సహజ నూనెలు ఉంటాయి. ఇవి పాత్రల మురికిని తొలగించేందుకు సహకరిస్తాయి. స్టీల్ లేదా నాన్-స్టిక్ పాత్రలపై మరకలుంటే, తొక్క లోపలి భాగాన్ని రుద్ది పావుగంటసేపు అలా వదిలేయాలి. తర్వాత స్క్రబ్బర్‌తో రుద్దాలి. ఇలా చేస్తు పాత్రకున్న మురికి పూర్తిగా పోతుంది. ఆ గిన్నెలు తళతళ మెరుస్తాయి.
34
వెండి, స్టీల్ పాత్రలు
వెండి పాత్రలు మసకబారినా లేదా స్టీల్ పాత్రలు మెరుపు కోల్పోయినా, వాటిని అరటి తొక్కతో రుద్ది నీటిలో నానబెట్టి కడిగితే వాటి మెరుపు తిరిగి వచ్చేస్తుంది అరటి తొక్కల్లో పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి తొక్కలను చిన్న ముక్కలుగా చేసి మొక్కలకు వేసే మట్టిలో కలపాలి. లేదా నీటిలో మరిగించి ఆ నీటిని మొక్కలకు పోయాలి. ఇది మొక్కలకు ఎంతో బలాన్ని అందిస్తుంది. సహజ ఎరువుగా కూడా పనిచేస్తుంది.
లెదర్ బూట్లు, హ్యాండ్‌బ్యాగులు, బెల్టులు వాడినా కొన్ని నెలల తరువాత మెరుపును కోల్పోతాయి. అరటి తొక్కలోని తెలుగు భాగంలో వాటిపై రుద్ది, ఆపై పొడి వస్ట్రంతో తుడిస్తే సహజమైన మెరుపు తిరిగి వస్తుంది అరటి తొక్కలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిని మన చర్మ సౌందర్యానికి వాడుకోవచ్చు. మొటిమలు, పొడి చర్మం ఉన్నవారు తొక్క లోపలి భాగాన్ని ముఖంపై నెమ్మదిగా రుద్దాలి. పది నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి.