టీనేజ్ మొటిమలు తగ్గాలంటే ఇలా చేయండి..

First Published Dec 1, 2022, 10:40 AM IST

టీనేజ్ మొటిమలు 8 నుంచి 18 ఏండ్ల వయసులో కనిపిస్తాయి.  ఇవి చర్మం పై పొరపై ఏర్పడతాయి. అయితే ఈ మొటిమల మచ్చలు వయోజనుల్లో వచ్చే మొటిమల మచ్చల్లా కాకుండా చాలా తొందరగా తగ్గిపోతాయి. వీటి గుర్తులు కూడా ఉండవు. 


సాధారణంగా మొటిమలు 8 నుంచి 18 ఏండ్ల వయసులోంచి ప్రారంభమవుతాయి. అయితే ఇవి చర్మంపై పొరపైనే ఏర్పడతాయి. వయోజనుల్లో వచ్చే మొటిమల్లా కాకుండా... టీనేజ్ మొటిమలు చర్మంపై మచ్చలను కలిగించవు. నిజానికి ఇవి చాలా తొందరగా తగ్గిపోతాయి కూడా.. 

కౌమారుల శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చర్మం సహజ నూనె అయిన సెబమ్ ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవుతుంది. ఈ సెబమ్ ఉత్పత్తి రంధ్రాలకు అడ్డుపడుతుంది. దీనివల్లే ముఖంపై మొటిమలు ఏర్పడతాయి. మరి ఈ మొటిమలను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

ఒత్తిడిని తగ్గించుకోండి

నిజానికి టీనేజర్లు చాలా ఒత్తిడికి గురవుతుంటారు. ఈ ఒత్తిడి పెరిగితే మొటిమలు ఎక్కువగా అవుతుంటాయి. అందుకే ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. స్క్రీన్ చూసే సమయాన్ని తగ్గిస్తే ఒత్తిడి నియంత్రణలో ఉంటుంది. అలాగే  శరీరంలో కార్టిసాల్ స్థాయిలు చాలా వరకు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోవడానికి ఒక గంట ముందు స్క్రీన్ కు దూరంగా ఉండాలి. దీనివల్ల మీరు రాత్రిళ్లు హాయిగా నిద్రపోతారు.ఇది మీ మొటమలను మరింత తొందరగా తగ్గిస్తుంది. అలాగే చర్మం అందంగా మెరిసిపోవడానికి సహాయపడుతుంది. 
 

వ్యాయామం

యుక్తవయసులో ఉండే పిల్లల అసైన్ మెంట్ లు, ఎక్సామ్స్ ల విషయంలో చాలా ఒత్తిడికి గురవుతారు. కానీ ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల చర్మంపై ఎఫెక్ట్ పడుతుంది. శారీరక శ్రమలేకపోవడం వల్ల కూడా మొటిమలు ఏర్పడే అవకాశం ఉంుది. అందుకే ప్రతిరోజూ వ్యాయామం చేయండి. శారీరాన్ని కదిలించే వ్యాయామాలను, ఇతర పనులను రోజుకు 60 నుంచి 90 నిమిషాల పాటు చేయండి. స్కీయింగ్, రాక్ క్లైంబింగ్, స్కేటింగ్, సైక్లింగ్, యోగా వంటివి మీ శరీరాన్ని చురుగ్గా ఉంచడానికి సహాయపడతాయి. 
 

ఆహారం

టీనేజ్ లో మొటిమలు అయిన వారు  కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. బిస్కెట్లు, చిప్స్, ఎనర్జీ డ్రింక్స్, కోలాలతో పాటుగా ఏ రకమైన ప్యాకేజ్డ్ ఫుడ్స్ ను తీసుకోకూడదు. ఇవి తినకపోతేనే మీ మొటిమలు పెరిగే అవకాశం ఉండదు. అలాగే తొందరగా తగ్గిపోతాయి కూడా. 


ఏం తినాలి?

పండ్లు, కూరగాయలను ఎక్కువ మొత్తంలో తినాలి. వీటిలో కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. దీన్నే విటమిన్ ఎ అంటారు. ఇది చర్మానికి చాలా అవసరం. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. గుమ్మడికాయ, డ్రై ఆప్రికాట్, ఆకుపచ్చని కూరగాయలను మీ రోజు వారి ఆహారంలో చేర్చండి. డ్రై ఆప్రికాట్ ను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం లేదా మధ్యాహ్నం భోజనం  లేదా విందు తర్వాత తినండి. 
 

మీ ఆహారంలో చేర్చాల్సిన ఇతర ఆహారాలు

మీ చర్మం ఆరోగ్యంతో పాటుగా అందంగా మెరిసిపోవాలంటే మాత్రం ఆవశ్యక కొవ్వు  ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం నెయ్యి, నట్స్, వెన్న వంటివి వాటిని తినండి. అలాగే మీ భోజనంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేట్టు చూసుకోండి. చిలగడదుంపలు, యామ్స్ ను వారానికి ఒకసారైనా తినండి. ఈ ఆహార పదార్థాలు టీనేజర్లలో హార్మోన్లు సజావుగా ఉండేట్టు చూస్తాయి. 
 

click me!