Alcohol: మందు తాగడానికి 2గంటల ముందు ఇలా చేస్తే మీ లివర్ డ్యామేజ్ అవ్వదు

Published : Dec 31, 2025, 01:24 PM IST

Alcohol:  న్యూ ఇయర్ పార్టీ చేసుకుంటున్నారా? ఆ పార్టీలో ఆల్కహాల్ తాగాలని అనుకుంటున్నారా? అయితే.. వాటి వల్ల ఆరోగ్యం దెబ్బ తినకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.

PREV
13
Alcohol

31 డిసెంబర్ రాత్రి పార్టీలు, వేడుకల్లో ఆల్కహాల్ సేవించే ప్లాన్ చాలా మందికి ఉంటుంది. అయితే.. ఆల్కహాల్ లివర్ ని చాలా ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. లివర్ మీద ఒత్తిడి పెంచుతుంది. దీని వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే.. లివర్ డ్యామేజ్ పూర్తిగా ఆపలేకపోయినా.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. కొంత వరకు లివర్ ని కాపాడుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

మీరు రాత్రి పూట మందు తాగాలి అనుకుంటే.. ఉదయం నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా, కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే చాలు.

23
రోజంతా ఏం తినాలి?

ఉదయం...

మీరు రాత్రికి మందు తాగాలి అనుకుంటే... ఉదయాన్నే..అల్పాహారాన్ని ప్రోటీన్, ఫైబర్ తో నిండి ఉన్న దానిని ఎంచుకోవాలి. అంటే.. బ్రేక్ ఫాస్ట్ లో కోడి గుడ్లు, ఓట్స్ లాంటివి తీసుకోవాలి. కోడి గుడ్డులో సిస్టీన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది ఆల్కహాల్ వల్ల శరీరంలో విడుదలయ్యే అసిటాల్టిహైడ్ అనే టాక్సిన్స్ విచ్ఛిన్నం చేయడానికి లివర్ కి సహాయపడుతుంది. ఓట్స్ కడుపు నిండుగా ఉంచి, ఆల్కహాల్ రక్తంలోకి వేగంగా చేరకుండా అడ్డకుంటాయి.

మధ్యాహ్నం...

మధ్యాహ్న భోజనంలో పాలకూర, బ్రకోలీ వంటి ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. భోజనంలో తప్పనిసరిగా పసుపు ఉండేలా చూసుకోవాలి. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది లివర్ వాపు నుంచి రక్షిస్తుంది. ఆకు కూరలు శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపడానికి అవసరమైన ఎంజైమ్స్ విడుదల చేస్తాయి.

సాయంత్రం...

ఆల్కహాల్ సేవించడానికి ముందు ఖాళీ కడుపుతో ఉండటం చాలా ప్రమాదం. అందుకే... మందు తాగడానికి 2 గంటల ముందు హెల్దీ ఫ్యాట్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా బాదం పప్పు, వాల్ నట్స్, యోగర్ట్ వంటివి తీసుకోవాలి. హెల్దీ ఫ్యాట్స్ మన కడుపు లోపల ఒక రక్షణ కవచంలా ఏర్పడతాయి. ఇది

హైడ్రేషన్...

మీరు ఆల్కహాల్ తాగాలి అనుకున్న రోజు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. అంటే ప్రతి రోజూ 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. అంతేకాదు.. మీరు తాగే ప్రతి పెగ్ కు మధ్యలో ఒక గ్లాసు నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డీ హైడ్రేషన్ సమస్య ఉండదు. లివర్ పనితీరు ను మెరుగుపరుస్తుంది.

33
పొరపాటున కూడా వీటి జోలికి వెళ్లకూడదు...

చక్కెర పానీయాలు (Sugary Mixers): ఆల్కహాల్ ని కూల్ డ్రింక్స్ లేదా సోడాతో కలపవద్దు. చక్కెర, ఆల్కహాల్ కలిస్తే లివర్ పైన భారం రెట్టింపు అవుతుంది. వీలైతే నీటితో మాత్రమే తీసుకోండి.

జంక్ ఫుడ్: ఆల్కహాల్ తాగుతున్నప్పుడు వేపుళ్లు (Fried foods) తినకూడదు. ఇవి కాలేయంలో కొవ్వు (Fatty Liver) పేరుకుపోయేలా చేస్తాయి. వీటికి బదులు సలాడ్స్ లేదా తక్కువ ఆయిల్ ఉన్న స్నాక్స్ తీసుకోండి.

తాగిన తర్వాత రోజు (Recovery)

మరుసటి రోజు ఉదయం కొబ్బరి నీళ్లు లేదా నిమ్మరసం తీసుకోండి. ఇవి శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యతను కాపాడతాయి. ఇలాంటి చిట్కాలు ఫాలో అయితే.. లివర్ డ్యామేజ్ ని కొంత వరకు కంట్రోల్ చేసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories