Recipes: చల్లని సాయంత్రంలో చక్కని చిరు తిండి.. కరకరలాడే క్రిస్పీ కార్న్!

Navya G | Published : Jul 21, 2023 2:46 PM
Google News Follow Us

 Recipes: మొక్కజొన్న  తో లెక్కలేనన్ని చిరుతిళ్ళు తయారు చేసుకోవచ్చు అందులో ఒకటి కరకరలాడే క్రిస్పీకార్న్. నోటికి రుచిగా ఉండటమే కాకుండా ఒంటికి కూడా ఆరోగ్యం. అదెలా చేయాలో చూద్దాం.
 

16
 Recipes: చల్లని సాయంత్రంలో చక్కని చిరు తిండి..  కరకరలాడే  క్రిస్పీ కార్న్!

ముందుగా క్రిస్పీ కార్న్ తయారు చేయడం కోసం ఒక కప్పు ఉడికించిన స్వీట్ కార్న్ గింజలు, రెండు టేబుల్ స్పూన్లు మైదాపిండి, నాలుగు టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్, తగినంత ఉప్పు, సన్నగా తరిగిన వెల్లుల్లి రెండు టేబుల్ స్పూన్లు, రెండు స్పూన్లు సన్నగా తరిగిన అల్లం.
 

26
Herbed corn chaat

రెండు టేబుల్ స్పూన్లు తరిగిన పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్ రెండు టేబుల్ స్పూన్ల షెజ్వాన్  సాస్. నూనె వేయించడానికి సరిపడినంత. ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూద్దాం.
 

36

 మొక్కజొన్నగింజలు,మొక్కజొన్న పిండి, మైదాపిండి, ఉప్పు మిరియాలు ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి అందులో ఒక టేబుల్ స్పూన్ వాటర్ కూడా కలిపితే పిండి  మొక్కజొన్న గింజల కి బాగా అంటుకుంటుంది.

Related Articles

46

 లోతైన నాన్ స్టిక్ కడాయిలో నూనెని వేడి చేసి అందులో మొక్కజొన్నను కొంచెం కొంచెం గా వేస్తూ డీప్ ఫ్రై చేయండి బంగారు రంగులోకి వచ్చేవరకు అటు ఇటు కదుపుతూ ఉండండి తర్వాత తీసి బట్టర్ పేపర్ మీద వేయండి అలా చేయడం వలన కార్న్ కి  ఉన్న ఎక్స్ట్రా నూనె ఆ పేపర్ పీల్చుకుంటుంది.
 

56

తర్వాత నాన్ స్టిక్ పాన్ లో కొంచెం నూనె వేసి అందులో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి కొంచెం సేపు వేయించాలి తర్వాత రింగ్ ఆనియన్ వేసి కొద్దిసేపు కలపండి. తర్వాత షెజ్వాన్ సాస్, కొద్దిగా ఉప్పు కలిపి మరొక నిమిషం పాటు మంట మీద ఉంచండి.
 

66

 తర్వాత ఈ వేయించిన ఇంగ్రిడియెంట్స్ అన్నీ ముందుగా వేయించి పెట్టుకున్న కార్న్ లో బాగా కలపండి. ఇంకేముంది కరకరలాడే క్రిస్పీ కార్న్ రెడీ. ఇప్పుడు చెప్పిన కొలతల ప్రకారం చేసిన వంటలో 483 క్యాలరీలు శక్తి ఉంటుంది. అలాగే ఫైబర్ 5.3 గ్రామ్స్ కార్బోహైడ్రేట్లు 45.1 g ఉంటాయి. కాబట్టి రుచికి కాదు ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది.

Recommended Photos