Beauty Tips: నిమ్మకాయ ఆరోగ్యానికే కాదు అందానికి కూడా.. అందమైన ముఖం కోసం ఇలా చేయండి!

Published : Jul 21, 2023, 02:29 PM IST

Beauty Tips: నిమ్మకాయ బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ గా చెప్పుకోవచ్చు ఇది ఆరోగ్యం కోసమే కాదు అందానికి కూడా బెస్ట్ ఆప్షన్. నిమ్మకాయని ఉపయోగించి ముఖాన్ని అందంగా తయారు చేసుకోవచ్చంట అది ఎలాగో చూద్దాం.  

PREV
16
Beauty Tips: నిమ్మకాయ ఆరోగ్యానికే కాదు అందానికి కూడా.. అందమైన ముఖం కోసం ఇలా చేయండి!

 ప్రకృతిలో విరివిగా లభించే నిమ్మకాయతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అయితే ఆరోగ్యంతో పాటు సౌందర్యాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు. నిమ్మకాయను చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు.
 

26

సగం కోసిన నిమ్మకాయలో తేనె కొద్దిగా వేసి ముఖానికి మెత్తగా మసాజ్ చేసుకోవాలి తర్వాత 15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి ఆపై చల్లని నీటితో ముఖాన్ని కడుక్కుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది.అలాగే ముడతలు నల్ల మచ్చలు ఉంటే తొలగిపోతాయి.
 

36

ఇలా వారానికి మూడు, నాలుగు సార్లు చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. ముఖంపై ముడతలు సమస్య ఇబ్బంది పడుతుంటే బొప్పాయి రసంలో నిమ్మ తొక్కు పొడి కలుపుకొని దానిని మొహానికి ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలి.

46

ఒక అరగంట తర్వాత నీళ్లతో కడుక్కోవడం వలన మడతలో పోవటమే కాకుండా నిత్యం యవ్వనంగా కనిపిస్తారు. అలాగే రాత్రి పడుకునే ముందు నిమ్మరసంలో కొంచెం తేనె కలిపి రాసుకుంటే పెదవులు మృదువుగా అందంగా తయారవుతాయి.

56

అయితే పొడి చర్మం ఉన్నవారు మాత్రం నిమ్మరసాన్ని చాలా తక్కువ మోతాదులో వాడాలి. అలాగే డ్రై స్కిన్ ఉన్నవారు నేరుగా నిమ్మరసాన్ని వాడకూడదు పాలల్లో గాని నీళ్లలో గాని కలుపుకొని అప్పుడు ముఖంపై అప్లై చేసుకోవాలి. ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని తీసుకొని అందులోనే ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జుని వేసి బాగా కలపాలి.

66

ఇందులో ఒక టేబుల్ స్పూన్ తేనె ఒక టేబుల్ స్పూన్ నీరు పోసి బాగా కలియబెట్టాలి ఈ మిశ్రమాన్ని చేత్తో కానీ దూదితో గాని ముఖానికి రాసుకుంటూ మూడు నుంచి ఐదు నిమిషాల సేపు మర్దన చేయాలి తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా చేయడం వలన ముఖంపై మృత కణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

click me!

Recommended Stories