Egg Puff Recipe: ఓవెన్ లేకుండా ఇంట్లోనే బేకరీ స్టైల్ ఎగ్ పఫ్.. నిమిషాల్లో రెడీ!

Published : Sep 28, 2026, 05:55 PM IST

Egg Puff Recipe: బేకరీలో దొరికే వేడి వేడి ఎగ్ పఫ్ ని చాలామంది ఇష్టంగా తింటారు. అయితే ఓవెన్ లేకపోయినా ఇంట్లోనే క్రిస్పీగా, లేయర్లతో బేకరీ స్టైల్ ఎగ్ పఫ్ చేసుకోవచ్చు. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా సింపుల్‌గా చేసే ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి.

PREV
15
ఎగ్ పఫ్ రెసిపీ

టీ టైమ్ స్నాక్‌గా, ఈవెనింగ్ స్నాక్‌గా ఎగ్ పఫ్‌కు మంచి క్రేజ్ ఉంటుంది. సాధారణంగా బేకరీలో కొనుక్కునే ఈ ఎగ్ పఫ్‌ను ఓవెన్ లేకుండా కుక్కర్ సహాయంతో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి బేకరీ స్టైల్‌లో క్రిస్పీగా, రుచిగా ఎగ్ పఫ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

25
ఎగ్ పఫ్స్ చేయడానికి కావాల్సిన పదార్థాలు
  • రెడీమేడ్ పఫ్ పేస్ట్రీ షీట్స్ - 4
  • ఉడికించిన గుడ్లు - 2
  • పెద్ద ఉల్లిపాయలు - 2
  • పచ్చిమిర్చి - 1
  • అల్లం - చిన్న ముక్క
  • కరివేపాకు - కొద్దిగా
  • కారం - ½ టీస్పూన్
  • పసుపు - ¼ టీస్పూన్
  • మిరియాల పొడి - ¼ టీస్పూన్
  • గరం మసాలా - ¼ టీస్పూన్
  • ఉప్పు - తగినంత
  • నూనె - 1 టేబుల్ స్పూన్

షీట్స్ పైన రాయడానికి కొద్దిగా గుడ్డు సొన లేదా పాలు

ఎగ్ పఫ్ చేయడానికి రెడీమేడ్ పఫ్ షీట్ వాడితే ఇంట్లో పిండి కలిపి పొరలు పొరలుగా చేసే పని తప్పుతుంది.

35
తయారీ విధానం

ఎగ్ పఫ్ స్టఫింగ్ కోసం ముందుగా మసాలా తయారు చేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని కొద్దిగా నూనె వేసి వేడయ్యాక.. కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేగాక పసుపు, కారం, మిరియాల పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు కలపాలి.

మసాలా పచ్చివాసన పోయాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఉడికించిన గుడ్లను సగానికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు పఫ్ షీట్‌ను చదరంగా కట్ చేసి, మధ్యలో కొద్దిగా ఉల్లిపాయ మసాలా, సగం గుడ్డు పెట్టి నాలుగు వైపులా మడిచి మూసేయాలి. పైన కొద్దిగా గిలకొట్టిన గుడ్డు లేదా పాలు రాస్తే పఫ్స్‌ మంచి రంగు వస్తాయి.

45
కుక్కర్‌లో పఫ్స్ ఎలా బేక్ చేయాలి?

5 లీటర్లు లేదా అంతకంటే పెద్ద కుక్కర్ అడుగున ఒక కప్పు ఉప్పు పోయాలి. దానిపై వేడిని తట్టుకునే స్టాండ్ పెట్టాలి. విజిల్, రబ్బర్ గ్యాస్కెట్ తీసేసి కుక్కర్ మూతపెట్టి తక్కువ మంటపై 5-10 నిమిషాలు వేడి చేయాలి. తర్వాత పఫ్స్ పెట్టిన ప్లేట్‌ను స్టాండ్‌పై ఉంచాలి. మూతపెట్టి లో ఫ్లేమ్ పై 25-30 నిమిషాలు బేక్ చేయాలి. పైన గోల్డెన్ కలర్ వచ్చి, పఫ్ పొరలు బాగా విచ్చుకున్నాక బయటకు తీయాలి. కుక్కర్‌లో బేక్ చేసేటప్పుడు అడుగున ఉప్పు లేదా ఇసుక వేసి, స్టాండ్‌పై ప్లేట్ పెట్టడం సాధారణ పద్ధతి. ముఖ్యంగా కుక్కర్‌లో ప్రెజర్ క్రియేట్ అయ్యేలా అస్సలు చేయకూడదు.

55
ఈ విషయాలు మర్చిపోవద్దు

పఫ్ షీట్‌ను ఎక్కువగా రుద్దకూడదు. గట్టిగా రుద్దితే పొరలు అతుక్కుపోయి పఫ్స్ సరిగా పొంగవు. స్టఫింగ్‌లో నీళ్లు ఉండకూడదు. ఉల్లిపాయ మసాలా తడిగా ఉంటే పఫ్ పేస్ట్రీ లోపల నానిపోయి క్రిస్పీనెస్ తగ్గుతుంది. కుక్కర్‌ను ముందే వేడి చేయాలి. వేడిగా ఉన్న కుక్కర్‌లో పఫ్ పేస్ట్రీ పెడితేనే పొరలు బాగా విచ్చుకుంటాయి. మూత పదే పదే తీయకూడదు. ప్రతిసారీ మూత తీస్తే లోపల ఉన్న వేడి బయటకు పోతుంది. లో ఫ్లేమ్ పైనే బేక్ చేయాలి. మంట ఎక్కువైతే అడుగు భాగం త్వరగా మాడిపోయి, పైభాగం సరిగా ఉడకదు. కుక్కర్ తెరిచాక ఎగ్ పఫ్స్‌ను బయటకు తీసి కాసేపు చల్లారనిచ్చి, టీ లేదా కాఫీతో వేడివేడిగా తింటే టేస్ట్ అదిరిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories