Hotel: హోటల్ లో స్టే చేస్తున్నారా? రూమ్ లోకి అడుగుపెట్టగానే ఫస్ట్ చేయాల్సింది ఇదే..!

Published : Sep 28, 2026, 03:54 PM IST

Hotel: ట్రిప్ కి వెళ్లినప్పుడు వేరే ప్రాంతాల్లో హోటల్స్ లో స్టే చేస్తున్నారా? అయితే, హోటల్ లో మీరు సేఫ్ గా ఉండాలంటే.. రూమ్ లోకి అడుగుపెట్టగానే కొన్ని పనులు చేయాలి.

PREV
13
హోటల్ కి వెళ్తున్నారా?

ప్రయాణాలు చేయడం ఎవరికైనా ఇష్టమే. కొత్త ప్రదేశాలు చూస్తూ, హోటల్ రూమ్‌లో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని అందరూ కోరుకుంటారు. కానీ, మనం బస చేసే ఆ హోటల్ గది నిజంగానే సురక్షితమైనదేనా? ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ హోటల్ రూమ్‌లలో హిడెన్ కెమెరాలు పెట్టడం, అన్‌సేఫ్ వై-ఫై ద్వారా డేటా దోచేయడం వంటి మోసాలు ఎక్కువైపోయాయి. కాబట్టి ట్రిప్‌ను ఎంజాయ్ చేసే ముందు మీ రూమ్ సేఫ్టీని మీరే ఎలా చెక్ చేసుకోవాలో ఈ సింపుల్ చిట్కాల ద్వారా తెలుసుకుందాం..

23
హిడెన్ కెమేరాలను గుర్తించాలి..

రూమ్‌లోకి వెళ్లగానే ప్రైవసీకి భంగం కలిగించేలా హిడెన్ కెమెరాలు ఉన్నాయో లేదో చెక్ చేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా బెడ్‌కు ఎదురుగా ఉండే టీవీ, స్మోక్ డిటెక్టర్లు, వాల్ క్లాక్స్, మిర్రర్స్ , బాత్రూమ్‌లోని షవర్ హెడ్స్ దగ్గర చిన్న లెన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయేమో పరిశీలించండి.

. లైట్లు ఆఫ్ చేసి ఫ్లాష్‌లైట్ ట్రిక్ ఉపయోగించండి

గదిలోని లైట్లన్నీ ఆపేసి, మీ ఫోన్ ఫ్లాష్‌లైట్‌ని ఆన్ చేసి ప్రతి మూలలోనూ వెతకండి. ఎక్కడైనా కెమెరా లెన్స్ ఉంటే ఆ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి మెరుస్తుంది. అలాగే మార్కెట్లో దొరికే యాంటీ-స్పై డిటెక్టర్ యాప్స్ లేదా కెమెరా డిటెక్టర్లను ఉపయోగించి కూడా హిడెన్ కెమెరాల సిగ్నల్స్‌ను కనిపెట్టవచ్చు.

3. 'టూ-వే మిర్రర్' టెస్ట్ చేయండి

గదిలోని అద్దం నిజమైనదా లేక అవతలి వైపు నుంచి ఎవరైనా మిమ్మల్ని చూసే అవకాశం ఉందేమో తెలుసుకోవడానికి ఒక చిన్న టెస్ట్ చేయవచ్చు. మీ చేతి గోరును అద్దంపై ఉంచండి. మీ వేలికి, అద్దంలో కనిపించే దాని ప్రతిబింబానికి మధ్య చిన్న గ్యాప్ కనిపిస్తే అది సాధారణ అద్దం. ఒకవేళ గ్యాప్ లేకుండా వేలిగోరు నేరుగా అద్దానికి తాకినట్లు అనిపిస్తే అది టూ-వే మిర్రర్ అయ్యే అవకాశం ఉంది, అప్రమత్తంగా ఉండండి.

33
హోటల్ వై-ఫై వాడేటప్పుడు భద్రత ముఖ్యం

హోటల్స్ ఇచ్చే పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌లు చాలా వరకు సురక్షితంగా ఉండవు. వీటిని హ్యాకర్లు సులభంగా టార్గెట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి హోటల్ వై-ఫై కనెక్ట్ చేసిన వెంటనే ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు లేదా వ్యక్తిగత పాస్‌వర్డ్‌లను టైప్ చేయడం మానుకోండి. వీలైతే మీ మొబైల్ డేటాను వాడుకోవాలి.

5. డోర్ లాక్ , సెక్యూరిటీ చైన్ చెక్ చేయండి

మీరు పడుకునే ముందు లేదా గదిలో ఉన్నప్పుడు డోర్ లాక్ సరిగ్గా పనిచేస్తోందో లేదో సరిచూసుకోండి. డోర్ మానిటర్ లేదా ఐ-హోల్ కి ఏవైనా కవర్లు లేదా డామేజ్ ఉందేమో చూడండి.

ఎమర్జెన్సీ సేఫ్ డోర్స్ గుర్తించండి

హోటల్‌లోకి అడుగుపెట్టిన వెంటనే అగ్నిప్రమాదాలు లేదా అత్యవసర పరిస్థితులు ఎదురైతే బయటపడే మార్గాలు ఎక్కడ ఉన్నాయో ఒకసారి పరిశీలించండి. దీని వల్ల కొన్ని ప్రమాదాల నుంచి బయటపడొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories