అక్టోబర్ లో వర్షాలు తగ్గి ఆహ్లాదకరమైన వాతావరణం మొదలవుతుంది. దసరా సెలవులు కూడా తోడవడంతో ఫ్యామిలీ ట్రిప్ కు ఇదే సరైన సమయం. ఈ నెలలో ప్రకృతి అందాలు, చారిత్రక ప్రదేశాలు, హిల్ స్టేషన్లను ఎక్కడెక్కడ చూడొచ్చో తెలుసుకుందాం.
అక్టోబర్ నెలలో కోల్‌కతా చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఈ సమయంలో కోల్‌కతా ప్రజలు దుర్గా పూజల సంబరాల్లో మునిగిపోతారు. రాత్రి పూట నగరం మొత్తం రంగురంగుల దీపాలతో మెరిసిపోతుంది. వెరైటీ థీమ్స్‌తో వేసిన పండల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, కోల్‌కతా స్ట్రీట్ ఫుడ్, మార్కెట్లను ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఇదే సరైన సమయం.