వ్యాయమం చేయడం ఇష్టం లేదా? ఫిట్ గా ఉండాలంటే ఈ పనులు చేయండి చాలు..

Published : Oct 28, 2022, 01:15 PM IST

ఫిట్ గా ఉండటం అంత తేలికైన పని కాదు. దీనికోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అయితే కొంతమంది ఫిట్ గా ఉండాలనుకుంటారు కానీ.. అందుకోసం జిమ్ కు మాత్రం వెళ్లరు. ఇలాంటి వాళ్లు కొన్ని పనులు చేస్తే చాలు ఫిట్ గా ఉంటారు.   

PREV
14
వ్యాయమం చేయడం ఇష్టం లేదా? ఫిట్ గా ఉండాలంటే ఈ పనులు చేయండి చాలు..

నడుము, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతే... శరీర ఆకారం మొత్తం ఛేంజ్ అవుతుంది. నచ్చిన డ్రెస్ లను అసలే వేసుకోలేరు. ముఖ్యంగా దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలొచ్చే ప్రమాదం కూడా ఉంది. ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. మంచి ఆహారం తినాలి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వాళ్లు ఖచ్చితంగా ప్రతిరోజూ జిమ్ముల్లో చెమటలు చిందించాల్సిందే. అయితే కొంతమందికి వ్యాయామం చేయడమంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇలాంటి వాళ్లు కొన్ని పనులను చేసినా.. శరీరం ఫిట్ గా ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. అవేంటంటే..
 

24

మెట్లు ఎక్కండి

కాలం మారింది. కాలంతో పాటు మనుషుల అలవాట్లు కూడా మారిపోతున్నాయి. ఒకప్పుడు  ఎంత పెద్ద బిల్డింగ్ నైనా మెట్లను ఎక్కే వెళ్లేవారు. ఇప్పుడు ఆఫీసులకే కాదు.. ఇళ్లల్లో కూడా ఎలివేటర్లను వాడుతున్నారు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ కు వెల్లడానికి కూడా ఎలివేటర్లను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల మీరు త్వరగా చేరుకోవచ్చు. కానీ మీ ఆరోగ్యం మాత్రం చాలా దెబ్బతింంటుంది. ఇంట్లో లేదా.. పబ్లిక్ ప్లేస్ లో ఎలివేటర్లను, ఎస్కలేర్లను ఉపయోగించకపోవడమే మంచిది. వీటికి బదులుగా వీలైనన్ని ఎక్కువ మెట్లని ఎక్కండి. ఎందుకంటే మెట్లు ఎక్కడం వల్ల మీ శరీరం ఫిట్ గా ఉంటుంది. బరువు కూడా తగ్గుతారు. బాడీ మంచి షేప్ లోకి వస్తుంది కూడా. 
 

34

సైక్లింగ్

ట్రెడ్ మిల్ మీద పరిగెత్తడం చాలా మందికి నచ్చదు. ఇలాంటి వాళ్లు సైక్లింగ్ చేయొచ్చు. ప్రతిరోజూ అర్థగంట లేదా గంటపాటు సైక్లింగ్ చేయడం వల్ల మీ శరీర బరువు తగ్గుతుంది. తొడలు, పిక్కల్లో పేరుకుపోయిన కొవ్వు తగ్గిపోతుంది. గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. అందుకే చిన్న చిన్న పనులకు సైకిల్ పై వెళ్లడం అలవాటు చేసుకోండి. 

44
Vollyball

ఆటలు ఆడండి

రన్నింగ్ చేయడం మీకు ఇష్టం లేకపోతే.. బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, వాలీబాల్ వంటి ఆటలను ఆడండి. కనీసం రోజుకు ఒక గంటపాటు ఇలాంటి ఆటలను ఆడితే మీ శరీరం ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటుంది. బరువు కూడా చాలా వరకు తగ్గుతారు. ముఖ్యంగా ఎన్నో రోగాలొచ్చే ప్రమాదం తగ్గుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories