Shower: తలస్నానం చేస్తే బ్రెయిన్ షార్ప్ అవుతుందా? కొత్త ఐడియాలు వస్తాయా?

Published : Aug 11, 2026, 04:00 PM IST

Shower: ఆఫీస్ వర్క్ తో తల పగిలిపోతోందా? పని చేయడానికి కొత్త ఆలోచన ఒక్కటి కూడా రావట్లేదా? ఎంత తలబాదుకున్నా కూడా బుర్రకి మంచి ఐడియా తట్టడం లేదా? అయితే, కాసేపు పని పక్కన పెట్టి తలస్నానం చేయమని నిపుణులు చెబుతున్నారు.

PREV
14
Shower bath

చాలా మంది ఇంట్లో పెద్దవాళ్లు చెప్పే ఉంటారు. పరీక్షలు ఉన్నప్పుడు తలస్నానం చేయకూడదని, చేస్తే.. చదివింది మొత్తం మర్చిపోతారని చెబుతారు. కానీ, తలస్నానం చేస్తే.. మర్చిపోవడం కాదు.. కొత్త ఐడియాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వర్కింగ్ టేబుల్ ముందు కూర్చొని గంటల తరబడి ఆలోచించినా రాని ఐడియాలు.. వేడి నీటి స్నానంతో టక్కున వచ్చేయి. దీనినే షవర్ థాట్స్ అంటారు. అసలు.. ఏంటి ఈ షవర్ థాట్స్..? దీని వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం...

24
ఐడియాలు రావట్లేదా.. తలస్నానం చేస్తే సరి..

'సైకాలజీ టుడే' (Psychology Today) కథనం ప్రకారం.. మన మెదడును ఏదైనా ఒక పనిచేయమని గట్టిగా ఒత్తిడి చేయనప్పుడు, దానికి స్వేచ్ఛగా ఆలోచించే అవకాశం లభిస్తుంది. నడవడం, ఎక్సర్‌సైజ్ చేయడం, బాగా అలవాటైన దారిలో డ్రైవింగ్ చేయడం లేదా స్నానం చేయడం వంటి పనులు చేస్తున్నప్పుడు బ్రెయిన్ 'యాక్టివ్ థింకింగ్' నుండి కాస్త పక్కకు తప్పుకుంటుంది. దాంతో బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న ఐడియాలు సడన్‌గా మన కాన్షియస్ మైండ్‌లోకి వచ్చేస్తాయి. దీంతో, వెంటనే మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

షవర్‌లో మాత్రం ప్రశాంతత.. 

నేటి డిజిటల్ యుగంలో ప్రశాంతత దొరకడం చాలా కష్టం. నోటిఫికేషన్లు, ఈమెయిల్స్, మీటింగ్స్.. మన దృష్టిని మళ్లిస్తూనే ఉంటాయి. కానీ షవర్ కింద ఉన్నప్పుడు ఎలాంటి ఫోన్ స్క్రీన్లు ఉండవు, శబ్దాలు ఉండవు. మెదడుకు డిస్టర్బెన్స్ లేని ఏకైక ప్రదేశం అదే. ఆఫీస్ డెస్క్ దగ్గర కూర్చుని ఎంత జుట్టు పీక్కున్నా రాని ఐడియా, ప్రశాంతంగా ఉన్నప్పుడు మైండ్‌లోకి వచ్చేస్తుంది.

34
'రిలాక్స్ మైండ్' మ్యాజిక్..

వేడినీటి స్నానం శరీరానికి విపరీతమైన విశ్రాంతిని ఇస్తుంది. కండరాలు సడలి, శ్వాస నిలకడగా మారి, బాడీలో టెన్షన్ తగ్గిపోతుంది. శరీరం ప్రశాంతపడితే, మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది. ముడిపడిన దారాన్ని గట్టిగా లాగితే అది మరింత బిగుసుకుపోతుంది. అదే నిదానంగా విప్పితే సులువుగా ఊడి వస్తుంది. మన బ్రెయిన్ కూడా అంతే, ఒత్తిడి తగ్గినప్పుడు, కొత్త కోణంలో ఆలోచించే శక్తి పెరుగుతుంది.

4. డోపమైన్ (Dopamine) ప్రభావం

'ది బెటర్ బాత్' నివేదిక ప్రకారం, వేడినీటి స్నానం మన శరీరంలో 'డోపమైన్' అనే కెమికల్‌ను విడుదల చేయడానికి సహాయపడుతుంది. ఇది మన మూడ్‌ని బూస్ట్ చేయడమే కాకుండా, విభిన్నమైన ఐడియా మధ్య కనెక్షన్స్ ఏర్పరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఆలోచనా విధానం మారి, కొత్త పరిష్కారాలు తడతాయి.

44
మైండ్ డైవర్షన్ కూడా మంచిదే..

మనం ఒకే సమస్యపై నిరంతరం దృష్టి పెడితే ఐడియాలు రావు. కాస్త గ్యాప్ ఇచ్చి సబ్‌కాన్షియస్ మైండ్ పని చేయడానికి అవకాశం ఇవ్వాలి. స్నానం చేసేటప్పుడు మనం ఒళ్లు రుద్దుకోవడం లేదా నీటి ఉష్ణోగ్రత సర్దుకోవడం లాంటి పనుల్లో ఉంటాం. కానీ బ్యాక్‌గ్రౌండ్‌లో బ్రెయిన్ మాత్రం మెయిన్ ప్రాబ్లమ్‌పై వర్క్ చేస్తూనే ఉంటుంది.

6. వాటర్ సౌండ్ ప్రశాంతత..

సరైన క్రమంలో వచ్చే నీటి చప్పుడు బయటి శబ్దాలను కట్ చేస్తుంది. ఇది మెదడును బయటి ప్రపంచంతో కాకుండా లోపలి ఆలోచనలతో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.దీని కారణంగా మనకు తెలీకుండానే ఆ నీటి శబ్దం మెదడుకు ప్రశాంతతను ఇస్తుంది.

అందుకే, ఇక నుంచి.. ఏదైనా సమస్యకు పరిష్కారం దొరకక ఇబ్బంది పడుతున్నప్పుడు.. ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా.. హాట్ వాటర్ షవర్ చేయండి. మీకు సొల్యూషన్ ఆటోమెటిక్ గా దొరికే అవకాశం ఉంటుంది

Read more Photos on
click me!

Recommended Stories