ఈ ఫుడ్స్ తింటే.. హై బీపీ పెరిగిపోతుంది..!

First Published | Sep 29, 2021, 1:00 PM IST

ఈ హైబీపీ ని కంట్రోల్ చేసుకోవాలంటే.. కొన్ని పదార్థాలకు కచ్చితంగా దూరంగా ఉండాలట. ఎందుకంటే.. ఈ ఆహారాలు తీసుకుంటే.. ఎక్కడేలని బీపీ రావడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం..

ఈ రోజుల్లో రక్తపోటు లేదా అధిక రక్తపోటు అనేది ఈ రోజుల్లో సాధారణంగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్య. రక్త నాళాలు నిరంతరం ఒత్తిడిని పెంచడం వలన ఇది గుండె, మెదడు, మూత్రపిండాలు, ఇతర వ్యాధుల ప్రమాదానికి దారితీస్తాయి. సాధారణంగా ధూమపానం, మద్యపానం చేసేవారిలో, వృద్ధులు, అధిక బరువు ( Over weight ) ఉన్నవారిలో, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలో రక్తపోటు ( Blood pressure) ఎక్కువగా కనిపిస్తోంది. 
 

రక్తపోటును అధిగమించాలంటే ఆహార నియమాలపై శ్రద్ధ వహించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. రోజువారి ఆహారంలో  పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ ఎక్కువగా ఉన్న పదార్దాలను తీసుకోవాలి.
 


అంతేకాదు.. ఈ హైబీపీ ని కంట్రోల్ చేసుకోవాలంటే.. కొన్ని పదార్థాలకు కచ్చితంగా దూరంగా ఉండాలట. ఎందుకంటే.. ఈ ఆహారాలు తీసుకుంటే.. ఎక్కడేలని బీపీ రావడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం..

మనలో చాలా మంది బ్రెడ్ ని బ్రేక్ ఫాస్ట్ గా.. స్నాక్స్ గా ఎక్కువగా తినేస్తూ ఉంటారు. బరువు తగ్గాలని అనుకునన్వారు కూడా.. ఉదయాన్నే ఆమ్లేట్ తో కలిపి బ్రెడ్ తినేస్తూ ఉంటారు. దాని వల్ల పొట్ట ఫుల్ గా ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుందని అనుకుటారు. అయితే.. నిజానికి.. ఈ బ్రెడ్ తినడం వల్ల హైబీపీ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందట. దీనిలో ఉండే సోడియం అనారోగ్యానికి దారి తీస్తుందట. కాబట్టి.. బ్రెడ్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని సూచిస్తున్నారు. బీపీ ఉన్నవారు దీనిని అస్సలు తీసుకోకూడదు. అంతేకాదు.. బరువు సులభంగా పెరగడానికి కారణం అవుతుంది.

ప్రస్తుతం మార్కెట్లో చికెన్, ఫిష్, మటన్, హాట్ డాగ్స్.. ఇలా ప్రాసెస్డ్ మీట్ ఎక్కువగా లభిస్తుంది. చేసుకొని తినడం సులభం కాబట్టి.. అందరూ వాటి వెంట పరుగులు తీస్తున్నారు. అయితే.. నిజానికి వాటిలో సోడియం శాతం ఎక్కువగా ఉంటుందట. మాంసం ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి అందులో ఉప్పు  కూడా ఎక్కువగాకలుపుతుంటారు. కాబట్టి.. అలాంటి మాంసం హైబీపీ ని మరింత పెరిగేలా చేస్తుంది. క్యాన్సర్ కి కూడా కారణమౌతుంది.

మనలో చాలా మందికి వేడి వేడిగా సూప్స్ తాగడం చాలా ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో కప్పులు కప్పులు లాగించేస్తూ ఉంటారు. అయితే.. మార్కెట్లో లభించే ఈ సూప్స్ కూడా ఆరోగ్యానికి అంత మంచిదేమీ కాదట. ప్యాక్ చేసిన సూప్స్ లో ఎలాంటి పోషకాలు ఉండవట. ఇంట్లో మనం అప్పటి కప్పుడు చేసుకొని తాగే సూప్ లో విటమిన్స్ ఉంటాయి. కాబట్టి వాటిని తాగవచ్చు. మార్కెట్లో పౌడర్ రూపంలో లభించే సూప్స్ మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు.
 

చాలా స్నాక్స్ లో ముఖ్యంగా సమోసాలు వంటి వాటిలో  చాలా మంది టమాటతో తయారు చేసిన ఆహార ఉత్పత్తులు ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా టమాట కెచప్, సాస్ లు ఎక్కువగా లాగించేస్తుంటారు. అయితే.. అవి ఆరోగ్యానికి మంచిది కాదట. వీటిలో కూడా సోడియం ఎక్కువగా ఉంటుంది. అవి ఆరోగ్యానికి  చేటు తీసుకువస్తాయి. వీటిలో చెక్కర కూడా ఎక్కువగా ఉంటుందనే విషయం గుర్తించాలి. దానికి బదులు ఇంట్లో టమాటా సాస్ తయారు చేసుకోవడం ఉత్తమం.

cup cakes

అంతేకాదు.. మార్కెట్లో లభించే కప్ కేక్స్, క్రీమీ కేక్స్, కూల్ డ్రింక్స్ లాంటివి కూడా తాగకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. హైబీపీ ఉన్నవారు.. పైన చెప్పిన వాటికి దూరంగా ఉంటూ.. అరటి పండ్లు ఎక్కువగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అరటి పండ్లు, పచ్చని కూరగాయాలు, ఆకు కూరలు, ఇతర పండ్లు, తృణ ధాన్యాలను ఆహారంగా తీసుకోవాలట. ఇవి తీసుకుంటే బీపీ కంట్రోల్ లో ఉంటుంది. 

Latest Videos

click me!