మన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. పోషకాలు తక్కువగా ఉండే ఆహారాలను తినడం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తినడం వల్ల శరీరలో కొలెస్ట్రాల్ పెరగడం మొదలవుతుంది. ఇవి మాత్రమే కాదు.. స్మోకింగ్ చేసేవారిలో, మద్యం తాగే వారిలో కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ కరగాలంటే శారీరక శ్రమ ఎక్కువగా చేయాలి. ముఖ్యంగా రోజంతా కూర్చుని పని చేసే వ్యక్తులు ఎటువంటి శారీరక శ్రమ చేయకపోతే.. వీరిలో కొలెస్ట్రాల్ స్థాయిలు బాగా పెరిగిపోతాయి.