డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవాలంటే ఈ ఆహారాలను తప్పక తినండి

Published : Nov 04, 2022, 04:07 PM IST

డెంగ్యూ నుంచి త్వరగా బయటపడాలంటే.. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచాలి. ప్రోటీన్లు, విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.   

PREV
110
 డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవాలంటే ఈ ఆహారాలను తప్పక తినండి
dengue

చలికాలం మొదలైంది. దీంతో డెంగ్యూ కేసులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో అక్టోబర్ ఒక్క నెలలోనే 1,200 లకు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అందుకే ఈ సీజన్ లో ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి.  ఈడిస్ ఈజిప్టి దోమల ద్వారే ఈ వ్యాధి మనుషులకు వ్యాపిస్తుంది. ఈ వ్యాధి వల్ల బ్లడ్ ప్లేట్లెట్ల సంఖ్య చాలా తగ్గిపోతుంది. దీనివల్ల ఒంటి నొప్పులు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి. 

210

డెంగ్యూ రోగుల పోషకాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేట్ గా ఉంచుకోవాలి. రెగ్యులర్ గా 4 లీటర్ల నీటిని ఖచ్చితంగా తాగాలని నిపుణులు చెబుతున్నారు. డెంగ్యు రోగులు ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి డ్రింక్స్ ను తాగాలో తెలుసుకుందాం పదండి.. 
 

310

వేప నీరు: వేపనీరు డెంగ్యూ పేషెంట్లకు ప్రయోజకరంగా ఉంటుంది. ఇందుకోసం కొన్ని తాజా వేప ఆకులను తీసుకుని నీటిలో వేసి మరిగించి తీసుకోవాలి. ఇది నొప్పి నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతుంది. ఈ నీటిని రోజూ తాగితే మీ శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. 

410

బొప్పాయి ఆకులు: బొప్పాయి ఆకుల్లో యాంటీ మలేరియా గుణాలుంటాయి. అంతేకాదు వీటిలో ఈ రోగాలన్నీ నయం చేసే లక్షణాలు కూడా ఉంటాయి. ఈ బొప్పాయి ఆకులు రక్తంలో ప్టేట్ లెట్ ల సంఖ్యను పెంచుతుంది. ఇందుకోసం రెండు తాజా బొప్పాయి ఆకులను తీసుకుని వాటిని చూర్ణం చేయండి. వీటి నుంచి రసాన్ని బయటకు తీయండి. దీన్ని ఒక కప్పు నీటిలో కలిపి తాగండి. అయితే ఈ నీటిని వడకట్టడం మర్చిపోకండి. 

510

కాకరకాయ జ్యూస్: దీన్ని జ్యూస్ గా చేసుకుని కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా కరేలా చర్మాన్నీ పీల్ చేసి ముక్కలుగా కట్ చేయండి. దీనిలో ఒక గ్లాస్ వాటర్ పోసి బ్లెండ్ చేయండి. దీన్ని ఇతర కూరగాయలతో కలిపి కూడా తినొచ్చు. 

610
Tulsi Tea

తులసి:  తులసిని టీ రూపంలో కూడా తీసుకోవచ్చు. గ్రీన్ టీ తాగే అలవాటుంటుంటే.. దీన్ని తయారుచేసేటప్పుడు దానిలో తులసి ఆకులను వేయండి. కానీ దీనిలో పాలను కలపకూడదు. కొన్ని తాజా తులసి ఆకులను తీసుకుని నీటిలో వేసి మరిగించి వడకట్టండి. దీనికి నిమ్మరసం కూడా కలపొచ్చు. 

710

రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరికాయ, బొప్పాయి. నారింజ వంటి  ఆహారాలను తీసుకోండి. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటేనే మీరు డెంగ్యూ నుంచి త్వరగా బయటపడతారు. 
 

810

ప్లేట్లెట్ల సంఖ్యను పెంచడానికి దానిమ్మ రసం నల్లద్రాక్ష రసం, ఉడికించిన కూరగాయలను తినాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెబుతున్నారు. అవిసె గింజలు నూనెను తింటే కూడా రోగ నిరోధక వ్యవస్థ బలోపతేం అవుతుంది. బ్రోకలీ కూడా ఆరోగ్యానికి మంచిది. దీనిలో విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో ప్లేట్లెట్లను ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. 
 

910

కివి కూడా పండు కూడా డెంగ్యూ పేషెంట్లకు మంచిది. దీనిలో ఎక్కువ మొత్తంలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎలక్ట్రోలైట్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి. అంతేకాదు రక్తపోటును కూడా నియంత్రిస్తాయి. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. 
 

1010

వెల్లుల్లి, పసుపు వంటి ఆహారాలు కూడా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మీరు మాంసాహారి అయితే చికెన్ పులుసు, సూప్ ను తీసుకోవాలి. డెంగ్యు రోగులు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. చికెన్, గుడ్లు వంటివి తరచుగా తీసుకోవాలి. అయితే డెంగ్యూ పేషెండ్లు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. శుద్ధి చేసిన నూనె, పిండి (మైదా) తయారుచేసిన ఆహారాలను తినకపోవడమే మంచిది.   

Read more Photos on
click me!

Recommended Stories