Rat Control Tips: ఇంట్లో ఒక్క ఎలుక కూడా లేకుండా చేసే బెస్ట్ టిప్స్ ఇవిగో!

Published : Apr 01, 2026, 04:25 PM IST

ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉంటే అది ఆరోగ్యానికి, ఇంటి పరిశుభ్రతకు పెద్ద ప్రమాదంగా మారుతుంది. అవి ఆహారాన్ని పాడుచేయడమే కాకుండా, అనేక రకాల వ్యాధులను వ్యాప్తి చేసే అవకాశం ఉంటుంది. మరి ఎలుకల సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం. 

PREV
15
ఎలుకలను తరిమికొట్టే సహజ చిట్కాలు

ఇంట్లో ఒక్క ఎలుక కూడా లేకుండా చేయడం అనేది చాలా మందికి పెద్ద సవాల్‌ లా అనిపిస్తుంది. అయితే సరైన పద్ధతులు పాటిస్తే ఈ సమస్యను పూర్తిగా నివారించడం సాధ్యమే. ముందుగా ఎలుకలు ఇంట్లోకి ఎలా వస్తాయో అర్థం చేసుకోవాలి. అవి సాధారణంగా చిన్న రంధ్రాలు, తలుపుల కింద గ్యాప్‌లు, డ్రైనేజీ మార్గాలు లేదా గోడల్లో ఉన్న పగుళ్ల ద్వారా లోపలికి వస్తాయి. కాబట్టి ముందుగా ఇంట్లో ఉన్న చిన్న చిన్న రంధ్రాలను మూసివేయాలి. సిమెంట్, మెష్ వంటివి ఉపయోగించి ఈ గ్యాప్‌లను బలంగా మూసివేస్తే ఎలుకలు లోపలికి రావడం చాలా వరకు తగ్గుతుంది.

25
ఇంటి శుభ్రత

ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. ఎలుకలు ఎక్కువగా ఆహారం కోసం వస్తాయి. కాబట్టి వంటగదిలో లేదా ఇతర ప్రదేశాల్లో ఆహార అవశేషాలు లేకుండా చూసుకోవాలి. అన్నం, కూరగాయల వేస్ట్, చెత్త బుట్టల్లో ఉండే ఆహారపు వ్యర్థాలు ఇవన్నీ ఎలుకలను ఆకర్షిస్తాయి. కాబట్టి చెత్తను ప్రతిరోజూ బయట పడేయడం మంచిది.

అలాగే ఆహార పదార్థాలను ఎప్పుడూ మూత ఉన్న డబ్బాల్లోనే నిల్వ చేయాలి. ఓపెన్‌గా ఉంచిన ధాన్యాలు, పప్పులు, స్నాక్స్ వంటి పదార్థాలు ఎలుకలకు సులభంగా దొరుకుతాయి. కాబట్టి ఎయిర్‌టైట్ కంటైనర్లు ఉపయోగించడం మంచిది.

35
పుదీన నూనె

కొన్ని సహజ నివారణ పద్ధతుల ద్వారా కూడా ఎలుకలను తరిమికొట్టవచ్చు. పుదీన నూనె వాసన ఎలుకలకు నచ్చదు. పుదీన నూనెలో కాటన్ ని ముంచి ఎలుకలు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో ఉంచితే అవి రావడం తగ్గుతుంది. అలాగే ఉల్లిపాయ ముక్కలు లేదా నాఫ్తలీన్ బంతులు కూడా కొంతవరకు ఎలుకలను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఎలుకల కోసం ట్రాప్స్, బోనులు ఉపయోగించడం కూడా మంచి పద్ధతి. వీటి ద్వారా ఎలుకలను పట్టుకొని బయటకు వదిలేయవచ్చు. అయితే వీటిని ఉపయోగించినప్పుడు తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలు, పెంపుడు జంతువులు ఉన్నవారు పిల్లలు అటువైపు వెళ్లకుండా చూసుకోవాలి.

45
అల్ట్రాసోనిక్ రిపెల్లెంట్స్

ఎలుకల నివారణ కోసం అల్ట్రాసోనిక్ రిపెల్లెంట్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇవి మనకు వినిపించని శబ్ధ తరంగాలను విడుదల చేసి ఎలుకలను దూరంగా ఉంచుతాయి. అలాగే ఇంటి చుట్టుపక్కల పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచడం చాలా అవసరం. ఇంటి బయట చెత్త పేరుకుపోయి ఉంటే, లేదా పొదలు ఎక్కువగా ఉంటే ఎలుకలు అక్కడ నివసించి ఇంట్లోకి రావచ్చు. కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఈ సమస్యను ముందుగానే నివారించవచ్చు.

55
వీటిని పరిశీలిచడం ముఖ్యం

డ్రైనేజీ, పైపులైన్‌లను కూడా పరిశీలించాలి. కొన్నిసార్లు ఎలుకలు ఈ మార్గాల ద్వారా కూడా లోపలికి వస్తాయి. అవసరమైతే పైపులకు కవర్స్ పెట్టడం మంచిది. అలాగే పిల్లులు, ఇతర పెంపుడు జంతువులు కూడా కొంతవరకు ఎలుకలను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి.

Read more Photos on
click me!

Recommended Stories